SSC Recruitment : ఎస్ఎస్సీ 307 హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ పూర్తిచేసి ఉండాలి.

SSC Recruitment
SSC Recruitment : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 307 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. పోస్టుల వారీగా వివరాలను పరిశీలిస్తే జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 10 పోస్టులు, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 10 పోస్టులు, జూనియర్ ట్రాన్స్‌లేటర్ 287 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : IIMB Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరులో పలు పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల అనువాద అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తుంది.
READ ALSO : Meditation During Pregnancy : గర్భధారణ సమయంలో ధ్యానం వల్ల సుఖ ప్రసవం !
ఎంపిక ప్రక్రియ అభ్యర్థులకు టైర్ - 1, టైర్ – 2 రాతపరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి వేతనం విషయానికి వస్తే జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ కు రూ.35,400 – రూ.1,12,400, జూనియర్ ట్రాన్స్‌లేటర్ కు రూ.35,400 – రూ.1,12,400, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ కు రూ.44,900 – రూ.1,42,400 చెల్లిస్తారు.
READ ALSO : Cultivation of Dates : కరువు సీమలో ఖర్జూర సాగు.. నాటిన 4 ఏళ్లనుండి 80 ఏళ్ల వరకు పంట దిగుబడులు
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 12గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.ssc.nic.in పరిశీలించగలరు.