నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ శాఖలో 15వేల పోస్టులు భర్తీ
గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బటానీల్లా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా నిర్వహిస్తాం.

Telangana Government Jobs
Telangana Government Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ శాఖలో త్వరలోనే మరిన్ని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. గత సర్కార్ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని కోర్టు నిర్ణయించిందని తెలిపారు. త్వరలో ఫ్రెష్ గా మరో 64 పోస్టులు కలిపి పరీక్షలు నిర్వహించనున్నట్లుగా చెప్పారు సీఎం రేవంత్.
”తొందరలోనే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి మరో 15వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే 15 రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 15వేల పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా మీ ప్రభుత్వం చేపట్టబోతోంది. గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బటానీల్లా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా నిర్వహిస్తాం.
Also Read : లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహులు వీరే..
ఆనాటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు లోపభూయిష్టంగా ఉంది. హైకోర్టులో రెండుసార్లు రద్దయ్యాయి. ఇవాళ కోర్టు ఆదేశించింది గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయమని. అదనంగా ఏర్పడ్డ 64 ఖాళీలను కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం” అని సింగరేణి ఉద్యోగ మేళాలో రేవంత్ రెడ్డి తెలిపారు.