Group 1 Results : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..

ఈ నెల 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్ సీ ప్రకటించింది.

Group 1 Results : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..

Updated On : March 10, 2025 / 4:45 PM IST

Group 1 Results : తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్ సీ వెబ్ సైట్ లోని అభ్యర్థి లాగిన్ లో మార్కులు చూసుకోవచ్చు. 563 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్ సీ గతేడాది అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. ఇక రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్ సీ ప్రకటించింది.

అభ్యర్థులు టీఎస్ పీఎస్ సీ అధికారిక వెబ్ సైట్ లో (tspsc.gov.in. ) స్కోర్లు చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు 31వేల 382 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అభ్యర్థులు రీ వాల్యుయేషన్ కోసం టీజీపీఎస్ సీ పోర్టల్ లోకి లాగిన్ అవడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం పేపర్ కు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

స్కోర్లు ఇలా చెక్ చేసుకోండి..
టీజీపీఎస్ సీ ఐడీ
మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్
డేటాఫ్ బర్త్
వీటి ద్వారా స్కోర్లు చెక్ చేసుకోవచ్చు..

31వేల 382 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించగా పరీక్షకు హాజరైంది 21,093 మంది మాత్రమే.
టీఎస్ పీఎస్ సీ అధికారిక వెబ్ సైట్ tspc.gov.in లో రిజల్ట్స్ లింక్ చూడొచ్చు.
మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు అటెంట్ అవ్వాల్సి ఉంటుంది.
మెయిన్స్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

గ్రూప్ 1 పోస్టులు
డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో)
డీఎస్పీ
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీవో)
మున్సిపల్ కమిషనర్
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్

Also Read : సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు తుది గడువు ముగుస్తోంది.. వివరాలు చూడండి

జిల్లా పంచాయత్ ఆఫీసర్
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ మండల్ పరిషత్
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
లేబర్ ఆఫీసర్
డిస్ట్రిక్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్
డిస్ట్రిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్
డిస్ట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్

ఇలా స్కోర్లు చెక్ చేసుకోండి..
* కమిషన్ అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in. కి వెళ్లాలి
* టీఎస్ పీఎస్ సీ గ్రూప్ 1 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి
* లాగిన్ డిటైల్స్ సబ్మిట్ చేయాలి
* స్క్రీన్ పై టీఎస్ పీఎస్ సీ గ్రూప్ 1 రిజల్ట్ కనిపిస్తుంది
* పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి

నెక్ట్స్ వచ్చే ఫలితాలు ఇవే..
మార్చి 10 – గ్రూప్ 1 ఫలితాలు, ప్రొవిజినల్ మార్కులు విడుదల
మార్చి 11 – గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటన
మార్చి 14 – గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటన
మార్చి 17 – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన
మార్చి 19 – ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన