Group-1 Hall Tickets : టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ హాల్ టికెట్లు

గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) త‌న వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చింది. ఈ మేర‌కు అభ్య‌ర్థుల‌కు స‌మాచారం ఇస్తూ మీడియా సంస్థ‌ల‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Group-1 Hall Tickets : టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ హాల్ టికెట్లు

group-1 hall tickets

Updated On : October 10, 2022 / 7:02 AM IST

Group-1 Hall Tickets  : గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) త‌న వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చింది. ఈ మేర‌కు అభ్య‌ర్థుల‌కు స‌మాచారం ఇస్తూ మీడియా సంస్థ‌ల‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని సూచించింది.

ఈ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ స‌దుపాయం ప‌రీక్ష జరిగే అక్టోబ‌ర్16వ తేదీ వ‌రకు అందుబాటులో ఉంటుంద‌ని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. అయితే, ఆఖ‌రి స‌మ‌యంలో ర‌ద్దీకి అవ‌కాశం ఇవ్వ‌కుండా అభ్య‌ర్థులు ముందుగానే హాల్ టికెట్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని సూచించింది.
గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జ‌రుగుతుంది.

Telangana Government Jobs : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

ప‌రీక్షకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు హాల్ టికెట్‌పై, వెబ్‌సైట్‌లో ఉన్న సూచ‌న‌లను, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌ని టీఎస్‌పీఎస్సీ కోరింది. కాగా, అక్టోబ‌ర్ 16వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప‌రీక్ష జ‌రుగుతుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.