Ts Cets 2022 : నేటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణా ఈ సెట్, ఎంసెట్, ఐసెట్ 2022 దరఖాస్తులు

తెలంగాణ ఐసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఐసెట్‌ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తోంది.

Ts Cets 2022 : నేటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణా ఈ సెట్, ఎంసెట్, ఐసెట్ 2022 దరఖాస్తులు

Ts Cets

Updated On : April 6, 2022 / 9:21 AM IST

Ts Cets 2022 : టిఎస్ ఈసెట్ 2022 : తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి నుండి ప్రారంభమవుతుంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 6 నుంచి జూన్ 8 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసెట్‌లో అర్హత సాధించడం ద్వారా డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్‌ అభ్యర్థులకు 2022-23 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ కల్పిస్తారు.దరఖాస్తు ఫీజుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి. రూ. 500ల ఆలస్య రుసుముతో జూన్‌ 14 వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో జులై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసెట్‌ ప్రవేశ పరీక్షను జూలై 13న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో ఒకేరోజున ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ఈ పరీక్షను నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఎంసెట్‌ 2022 : తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీమ్యాథమెటిక్స్‌ విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అలాగే జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో, CBT మోడ్‌లో 3 గంటల పాటు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి మే 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీలకు రూ.400 ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ ‌eamcet.tsche.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణా ఐసెట్ 2022 : తెలంగాణ ఐసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఐసెట్‌ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 27, 28 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఐసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ కాకయతీ యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం జనరల్ అభ్యర్ధులకు రూ.650, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.450లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. అడ్మిట్ కార్డులు జూలై 18 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. తుది ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.