TG EAPCET Counselling: టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. రేపటినుంచి సెకండ్ ఫేజ్.. ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025(EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవగా.. జూలై 25 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.

TG eapcet second phase counseling starts from July 25th
తెలంగాణ ఈఏపీసెట్ 2025(EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవగా.. జూలై 25 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. జూలై 30లోపు సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు అధికారులు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలివే:
జులై 25వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలుకానుంది
జులై 26న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది
జులై 26 నుంచి 27 వరుకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది.
జులై 27న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ కు అవకాశం ఉంటుంది
జులై 30న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
జులై 30న సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి
జులై 30 నుంచి ఆగస్టు 2 వరకు ఫిజికల్ రిపోర్టింగ్ చేసుకోవాలి
ఫిజికల్ రిపోర్టింగ్ చేసుకోకపోతే సీటు క్యాన్సల్ అవుతుంది.
టీజీ ఈఏపీసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 94,059 సీట్లకుగానూ 77,561 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 59,980 మంది మాత్రమే తమకు అలాట్ అయిన విద్యాసంస్థల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నారు.