TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్.. ఫైనల్ ఫేజ్ మొదలయ్యింది.. ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తి అవగా ఆగస్టు 5 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది.

TG EAPSET 2025 final phase counselling has begun.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తి అవగా ఆగస్టు 5 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgeapcet.nic.in/ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
- ఆగస్ట్ 6వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన మొదలవుతుంది.
- ఆగస్ట్ 6 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు మొదలవుతాయి.
- ఆగస్ట్ 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది.
- ఆగస్ట్ 10లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.
- ఆగస్ట్ 10 నుంచి 12వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
- ఆగస్ట్ 11 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేసుకోవాలి.
- రిపోర్టింగ్ చేయకపోతే కేటాయించిన సీటు రద్దవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఉన్న మొత్తం సీట్లు 91,495. వాటిలో ఇప్పటివరకు 83,521 సీట్లు కేటాయించబడ్డాయి. అంటే దాదాపు 91.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.