Career Paths After Inter: ఇంటర్ పాస్‌ అయ్యారా? ఇక ఈ జాబ్స్‌లో చేరొచ్చు..

రక్షణ రంగంలో ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు చాలా ఉంటాయి

Career Paths After Inter: ఇంటర్ పాస్‌ అయ్యారా? ఇక ఈ జాబ్స్‌లో చేరొచ్చు..

Updated On : April 22, 2025 / 1:01 AM IST

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సాధారణంగా డిగ్రీ పాస్ అయిన వారికి ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు బాగోలేక ఇంటర్‌తోనే చదువు మానేద్దామనుకుంటున్న వారు, డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసిన వారికి కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కింది విభాగాల్లో ఉద్యోగాలు

  • రక్షణ రంగంలో ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు చాలా ఉంటాయి
  • అగ్నివీర్‌
  • ఆర్మీ
  • నేవీ
  • ఎయిర్‌ఫోర్స్
  • ఆర్‌పీఎఫ్
  • సీఆర్‌పీఎఫ్
  • బీఎస్‌ఎఫ్
  • ఐటీబీపీ
  • ఎయిర్‌ ఫోర్స్‌లోని ఎయిర్‌ మెన్‌ విభాగంలో గ్రూప్‌ ఎక్స్/వై ట్రేడుల్లో జాబ్స్‌లో చేరవచ్చు
  • నేవీలో ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్/సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ పోస్టుల్లో చేరవచ్చు
  • ఆర్మీలో సోల్జర్‌ క్లర్క్/ స్టోర్‌ కీపర్‌ ఉద్యోగాల్లో చేరవచ్చు

Also Read: రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ ఎలా చేయించాలి? ఫీజు ఎంత? ప్రాసెస్ స్టెప్ బై స్టెప్

ఇతర ఉద్యోగాలు

  • రైల్వేలో జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్/అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్/జూనియర్‌ టైమ్‌ కీపర్, ట్రైన్స్‌ క్లర్క్/కమర్షియల్‌ కమ్‌ టికెట్‌
  • క్లర్క్‌ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు
  • స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పలు ఉద్యోగాలకు ఇంటర్‌ అర్హతతో నోటిఫికేషన్ ఇస్తుంది
  • కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పోస్టులను ఎస్‌ఎస్‌సీ ప్రతి ఏడాది భర్తీ చేస్తుంది
  • యూపీఎస్సీ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది

ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో..

  • తెలుగు రాష్ట్రాల్లో వీఆర్‌వో/వీఆర్‌ఏ వంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
  • పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు
  • గ్రూప్ 4తో పాటు కానిస్టేబుళ్లు వంటి జాబ్‌కు అర్హులే
  • హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు
  • బ్యూటీషియన్ కోర్సులో చేరొచ్చు
  • ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు
  • ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరవచ్చు
  • డీటీపీ నేర్చుకోవచ్చు
  • వెబ్ డిజైనింగ్ కోర్సులో చేరి ఉపాధి పొందొచ్చు
  • మల్టీమీడియాలో ఆసక్తి ఉంటే ఇందులోనూ చేరొచ్చు
  • ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు