TS ICET – 2019 నోటిఫికేషన్ రిలీజ్

  • Published By: madhu ,Published On : March 8, 2019 / 04:55 AM IST
TS ICET – 2019 నోటిఫికేషన్ రిలీజ్

Updated On : March 8, 2019 / 4:55 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2019 – 20 ఏడాదికి గాను అడ్మిషన్ల కోసం TS ICET -2019 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 08వ తేదీ శుక్రవారం రిలీజ్ చేస్తామని ఐసెట్ కన్వీనర్ వెల్లడించారు. హాల్ టికెట్లను మే 9వ తేదీ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2
మే 23, 24న ఆన్‌లైన్‌ పద్ధతిలో ఐసెట్‌ పరీక్ష.
మార్చి 13 నుంచి మే 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 450, ఇతరులకు రూ.650గా దరఖాస్తు ఫీజును నిర్ణయించారు. 
రూ. 500 అపరాధ రుసుముతో మే 6, రూ. 2 వేల అపరాధ రుసుముతో మే 11, రూ.5 వేలతో మే 15, రూ. 10 వేలతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోనే అవకాశం. 
Also Read : ఆన్ లైన్‌లో ప్రపోజ్ చేస్తే చంపేస్తా : హీరోయిన్ సోనాక్షి సిన్హా