Telangana Inter result: రీ వేరిఫికేషన్‌ దరఖాస్తులకు వారం రోజుల గడువు.. ఇలా అప్లై చేసుకోండి

ఫస్టియర్‌లో ఉత్తీర్ణత 66.89 శాతంగా, సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 71.37గా నమోదైంది.

Telangana Inter result: రీ వేరిఫికేషన్‌ దరఖాస్తులకు వారం రోజుల గడువు.. ఇలా అప్లై చేసుకోండి

Updated On : April 22, 2025 / 1:07 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వచ్చేశాయి. ఫస్టియర్‌లో ఉత్తీర్ణత 66.89 శాతంగా, సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 71.37గా నమోదైంది. ఫస్టియర్‌లో మొత్తం 4,88,413 మంది పరీక్షలు రాశారు. వారిలో బాలికల ఉత్తీర్ణత 73.83 శాతంగా, బాలుర ఉత్తీర్ణత 57.83 శాతంగా ఉంది. సెకండియర్‌లో 5,08,582 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, బాలిక ఉత్తీర్ణత శాతం 74.21గా, బాలుర ఉత్తీర్ణత శాతం 57.31గా ఉంది.

ఇంటర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రీకౌంటింగ్‌ 
రీకౌంటింగ్‌, రీవేరిఫికేషన్ కోసం వారం రోజుల గడువు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. నెల రోజుల తర్వాత ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.

రీకౌంటింగ్, రీవేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చొప్పున ఫీజు కట్టాల్సి ఉంటుంది. స్కాన్డ్‌ కాపీ కమ్ రీవేరిఫికేషన్ కోసం ఒక్కో పేపరుకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.

BIE వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఫీజులు చెల్లించుకోవచ్చు.

Also Read: ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు ఉన్నాయి.. ఈ కోర్సుల్లో చేరతారా?