అక్టోబర్ 10 నుంచి TS LAWCET-2019 కౌన్సెలింగ్

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 02:52 AM IST
అక్టోబర్ 10 నుంచి TS LAWCET-2019 కౌన్సెలింగ్

Updated On : October 1, 2019 / 2:52 AM IST

న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన TS LAWCET-2019  మే 20న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించగా, జూన్ 2న ఫలితాలు విడుదల చేశారు. ఇక కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికోసం ఈ నెల (అక్టోబర్ 10, 2019) నుంచి ప్రారంభం కానుందని లాసెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు ప్రకటించారు. ఆదేరోజు నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనతోపాటు వెబ్‌ కౌన్సెలింగ్‌ కూడా మొదలవుతుందని తెలిపారు.  

అంతేకాదు సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న TS LAWCET మూడేండ్లు, ఐదేండ్లతో పాటు, LLM లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. సెప్టెంబర్ 10న లా మూడేండ్ల, 13న ఐదేండ్ల అభ్యర్ధులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి LLM అభ్యర్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సర్టిఫికెట్ల పరిశీలిన, వెబ్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుందని తెలిపారు.

ఇక కౌన్సెలింగ్‌ నిర్వహణకు JNTUH‌, నిజాం కాలేజీ, KMIT ఇంజినీరింగ్‌ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టరేట్‌లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.