Vacancies In Cantonment Board : రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్గాంలోని కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి పదో తరగతి, నర్సింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/పీయూసీ/మిడ్‌వైఫరీ/సైకియాట్రిక్ నర్సింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి.

Vacancies in Cantonment Board, Belgaum under Ministry of Defence
Vacancies In Cantonment Board : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్గాంలోని కంటోన్మెంట్ బోర్డులో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ప్యూన్, సఫాయివాలా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి పదో తరగతి, నర్సింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/పీయూసీ/మిడ్‌వైఫరీ/సైకియాట్రిక్ నర్సింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్లకు మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్యూన్ పోస్టులకు నెలకు రూ.17,000ల నుంచి రూ.28,950ల వరకు జీతంగా చెల్లిస్తారు. సఫాయివాలా పోస్టులకు నెలకు రూ.17,000ల నుంచి రూ.28,950ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు నెలకు రూ.33,450ల నుంచి రూ.62,600ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలున్న అభ్యర్ధులు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంటోన్మెంట్ బోర్డ్, BC No.41, ఖానాపూర్ రోడ్, క్యాంప్, బెలగావి-590001 (కర్ణాటక రాష్ట్రం). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://belgaum.cantt.gov.in/recruitment/ పరిశీలించగలరు.