NFL RECRUITMENT
NFL RECRUITMENT : నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్(యూఆర్)-34, ఎస్సీ-11, ఎస్టీ-06, ఓబీసీ(ఎన్‌సీఎల్)-16, ఈడబ్ల్యూఎస్-07 పోస్టులను కేటాయించారు. వీటిలో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టుల ఖాళీలు ఉండగా, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 10 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే వారి అర్హతలు ;
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో రెండేళ్ల ఎంబీఏ,పీజీడీబీఎం,పీజీడీఎం(మార్కెటింగ్),అగ్రి బిజినెస్ మార్కెటింగ్,రూరల్ మేనేజ్‌మెంట్,ఫారిన్ ట్రేడ్ ,ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. (లేదా) 60 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్)తోపాటు ఎంఎస్సీ(అగ్రికల్చర్- సీడ్ సైన్స్ & టెక్నాలజీ,జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్,ఆగ్రోనమీ ,సాయిల్ సైన్స్,అగ్రికల్చర్ కెమిస్ట్రీ,ఎంటమాలజీ ,పాథాలజీ అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : CTET 2024 : సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ దరఖాస్తుల ఆహ్వానం
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీతోపాటు సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా) పోస్టులకు దరఖాస్తుచేసకునే వారికి 60 శాతం మార్కులతో మూడేళ్లు, ఐదేళ్ల ఫుల్‌టైమ్ లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ/బీఎల్). కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వయోపరిమితి18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : YS Sharmila : షర్మిల కాంగ్రెస్‌కు మద్దతివ్వడానికి కారణం ఏంటి?
దరఖాస్తు ఫీజు వివరాలు ;
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగాను రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్ లైన్ పేమెంట్స్ విధానం లో ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం ;
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు. ఓఎంఆర్ విధానంలో మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు 5 మంది చొప్పున ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన వారిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.40,000 – రూ.1,40,000. చెల్లిస్తారు.
READ ALSO : Pest Control : పత్తిలో పెరిగిన తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
రాంచీ (ఝూర్ఖండ్), లక్నో (ఉత్తర్ ప్రదేశ్), ఛండీగఢ్ (ఛండీగఢ్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్), జైపూర్ (రాజస్థాన్), న్యూఢిల్లీ (ఢిల్లీ), బెంగళూరు (కర్ణాటక), భోపాల్ (మధ్యప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), ముంబయి (మహారాష్ట్ర), గువాహటి (అస్సామ్), కోల్‌కతా (వెస్ట్ బెంగాల్) లలో పరీక్ష నిర్వాహణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 01.12.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://careers.nfl.co.in/ పరిశీలించగలరు.