Daggubati Purandeswari : విజయసాయిరెడ్డిపై సుప్రీం చీఫ్ జస్టిస్ కు పురందేశ్వరి ఫిర్యాదు.. వైసీపీ ఎంపీ ఏమన్నారంటే?

పురంధేశ్వరి లేఖకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా పురంధేశ్వరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది ..

Daggubati Purandeswari : విజయసాయిరెడ్డిపై సుప్రీం చీఫ్ జస్టిస్ కు పురందేశ్వరి ఫిర్యాదు.. వైసీపీ ఎంపీ ఏమన్నారంటే?

Daggubati Purandeswari

Updated On : November 4, 2023 / 12:05 PM IST

Purandeswari – Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి తన పదవులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు. విజయసాయి రెడ్డి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపణలు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జిగా వున్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలు కు పాల్పడ్డారని లేఖలో పురందేశ్వరి పేర్కొన్నారు. అంతేకాక.. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఆయనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ.. వెంటనే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పురందేశ్వరి కోరారు.

Also Read : Congress – CPI Alliance : కొలిక్కివచ్చిన చర్చలు.. కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు

మరోవైపు ట్విటర్ వేదికగా పురంధేశ్వరిపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది పార్టీ టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే.. మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయామా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా? అంటూ విజయసాయిరెడ్డి పురంధేశ్వరిని ప్రశ్నించారు.

Also Read : YS Sharmila: మొన్న టీడీపీ, నిన్న టీజేఎస్.. నేడు వైఎస్‌ఆర్‌టీపీ.. ఎందుకిలా?