NLS Job Vacancies : నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి.

Vacancies in National Law School of India University
NLS Job Vacancies : బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన 11 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. సోషియాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. అలాగే ఐసీఎస్‌ఎస్‌ఆర్/యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్/స్టెట్/సెట్‌లో వ్యాలిడ్ ర్యాంక్ ఉండాలి.
ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్ 21, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nls.ac.in/ పరిశీలించగలరు.