UIDAI Job Vacancies 2023 : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI )లో ఖాళీల భర్తీ
ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

UIDAI Job
UIDAI Job Vacancies 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI )లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 1, 2024 లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : Heavy Rain Alert : తీవ్రవాయుగుండంగా మారిన వాయుగుండం
అర్హతలు ;
టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ చదివిన వారు అర్హులు.
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తిన వారు అర్హులు
సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఛార్టెడ్ అకౌంటెంట్, కాస్డ్ అకౌంటెంట్, ఎంబీఏ(ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించిన వారు , సెంట్రల్/స్టేట్ గవర్నమెంట్‌లో అకౌంట్స్ కేడర్‌లో ఎస్‌ఏఎస్ లేదా అందుకు సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఎస్‌టీఎంలో క్యాష్, అకౌంట్స్ ట్రైనింగ్ సక్సెస్‌పుల్‌గా పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూఐడీఐఏ ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల వయసు 56 ఏళ్లలోపు ఉండాలి. అర్హతలు పోస్టును భట్టి వేర్వేరుగా ఉన్నాయి.
READ ALSO : Ttd Recruitment 2023 : టీటీడీలో ఉద్యోగాలు… లక్షన్నర జీతం.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు
ఎంపిక ప్రక్రియ ;
అభ్యర్థులను డిప్యుటేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు UIDAIతో కలిసి న్యూఢిల్లీ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది.
వేతనం ;
టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.20,600 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.14,900 నుంచి రూ.71,000; ప్రైవేట్ సెక్రటరీకి రూ.20,600 నుంచి రూ.1,60,000, సీనియర్ అకౌంట్ ఆఫీసర్‌కు రూ.24,900 నుంచి రూ. 1,80,000 వరకు జీతం చెల్లిస్తారు.
READ ALSO : Dengue Recovery Diet : డెంగ్యూతో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిందా ? పెంచుకునేందుకు చేయాల్సింది ఇదే !
దరఖాస్తు విధానం ;
దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ విధానంలో ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్లికేషన్ ఫారమ్‌కు జత చేసి డైరెక్టర్ (HR), యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), బంగ్లా సాహిబ్ రోడ్, కాళీ మందిర్ వెనుక, గోలే మార్కెట్, న్యూఢిల్లీ-110001 అనే చిరునామాకు పంపాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.uidai.gov.in. పరిశీలించగలరు.