XAT Admit Card 2024 : త్వరలో XAT అడ్మిట్ కార్డ్ 2024 విడుదల.. హాల్‌టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
XAT Admit Card 2024 : XAT 2025 పరీక్షను జనవరి 5, 2025న నిర్వహించనున్నారు. XAT 2025 అడ్మిట్ కార్డ్ (xatonline.in) అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

XAT Admit Card 2024
XAT Admit Card 2024 : జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, జంషెడ్‌పూర్ (XLRI) త్వరలో జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (XAT) 2025 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేయనుంది. XAT 2025 అడ్మిట్ కార్డ్ (xatonline.in) అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు లాగిన్ వివరాలతో పాటు అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేసేందుకు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
XAT 2025 పరీక్ష ఆదివారం, జనవరి 5, 2025న నిర్వహించనున్నారు. XAMI తరపున XLRI, XAT పరీక్షలను నిర్వహిస్తుంది. 75 సంవత్సరాలుగా, మేనేజ్‌మెంట్ స్టడీ కోసం ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసేందుకు XLRI దేశవ్యాప్తంగా XAT పరీక్షను నిర్వహిస్తోంది. 250 కన్నా ఎక్కువ ఇన్‌స్టిట్యూట్‌లు అడ్మిషన్ల కోసం XAT స్కోర్‌లను ఉపయోగిస్తాయి.
XAT అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
- XAT అధికారిక వెబ్‌సైట్‌ని (xatonline.in)లో విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో XAT అడ్మిట్ కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
- (Submit) ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- XAT 2025 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.
XAT 2025 పరీక్ష జరిగే నగరాలివే :
ఈ పరీక్ష భారత్‌లోని వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. అందులో ఆగ్రా, అహ్మదాబాద్, ఔరంగాబాద్, అలహాబాద్, అంబాలా, అమరావతి, అమృత్‌సర్, బెంగళూరు, బెర్హంపూర్, భటిండా, భిలాయ్ నగర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్/మొహాలీ, చెన్నై, కోయంబత్తూర్, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ-NCR, ధన్‌బాద్, దిబ్రూగఢ్, దుర్గాపూర్/అసన్సోల్ , ఎర్నాకులం, గాంధీనగర్, గోవా, గోరఖ్‌పూర్, గౌహతి, గ్వాలియర్, హుగ్లీ, హుబ్బల్లి (హుబ్లీ), హైదరాబాద్ నగరాలు ఉన్నాయి.
అలాగే, ఇండోర్, జబల్‌పూర్, జలంధర్, జైపూర్, జమ్మూ, జంషెడ్‌పూర్, కన్నూర్, కాన్పూర్, కోల్‌కతా, కోట, కొట్టాయం, కర్నూలు, లక్నో, మదురై, మంగళూరు, ముంబై, మైసూరు (మైసూర్), నాగ్‌పూర్ నాసిక్, పాట్నా, పూణే, రాయ్‌పూర్, రాజమండ్రి, రాంచీ, రూర్కీ, రూర్కెలా, సంబల్‌పూర్, సిలిగురి, సూరత్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, తిరుపతి, తిరువళ్లూరు, ఉదయపూర్, ఉడిపి, వడోదర, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తేజ్‌పూర్, జోర్హాట్, రాజ్‌కోట్, షిల్లాంగ్, నహర్లాగన్ వంటి నగరాలు ఉన్నాయి.
కొత్తగా చేరిన 34 నగరాలివే :
ఈ సంవత్సరం పరీక్షను నిర్వహించేందుకు 34 కొత్త నగరాలను కూడా చేర్చారు. అందులో అజ్మీర్, అలీఘర్, అనంతపురం, అర్రా, బద్ది, బాలాసోర్, బరేలీ, భాగల్పూర్, బికనీర్, బిలాస్‌పూర్, చిక్కబల్లాపూర్, దర్భంగా, దావణగెరె, ధెంకనల్, హల్ద్వానీ, హజారీబాగ్, హిసార్, జోధ్‌పూర్, కలబురగి (గుల్బర్గా, కళ్యాణి, కళ్యాణి, కరీంనగర్, కె.మొరాదాబాద్, ముజఫర్‌నగర్, ముజఫర్‌పూర్, నాందేడ్, పాటియాలా, సేలం, సిమ్లా, సికర్, ఉజ్జయిని, వెల్లూర్ వంటి నగరాలు ఉన్నాయి.
Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!