Assembly Elections 2023: ఎమ్మెల్యే టికెట్ రాలేదని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్న సీనియర్ నేత.. ఎక్కడ, ఎవరో తెలుసుకోండి

ఆ తర్వాత మేనిఫెస్టోపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు, విలేకరుల సమావేశం అనంతరం ఆయనమాట్లాడుతూ.. తాను పార్టీతోనే కొనసాగుతానని చెప్పారు

Assembly Elections 2023: ఎమ్మెల్యే టికెట్ రాలేదని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్న సీనియర్ నేత.. ఎక్కడ, ఎవరో తెలుసుకోండి

Updated On : November 4, 2023 / 8:03 PM IST

Anil Singh Major: ఒక పార్టీలో టికెట్ రాకపోతే మరొక పార్టీలోకి వెళ్తారు. కానీ ఆయన అలా కాదు.. టికెట్ రాలేదని ఏకంగా రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించారు. అలా ఆయనేదో చోటామోటా లీడర్ కాదు. చాలా పెద్ద నేత. పేరు అనిల్ సింగ్ మేజర్. భారతీయ జనతా పార్టీ నేత. ఛత్తీస్‭గఢ్ రాష్ట్రం. వివరాల్లోకి వెళితే.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నేత అనిల్ సింగ్ మేజర్ క్రియాశీల రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. నిజానికి, అనిల్ సింగ్ మేజర్ కూడా అంబికాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ రేసులో ఉన్నారు. బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించిన విలేకరుల సమావేశంలో ప్రధాన వక్తగా ఆయన బలరాంపూర్ వచ్చారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కాగా, పార్టీకి ఆయన ప్రధాన సీనియర్ నాయకుడని, ఆయన అసంతృప్తికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓంప్రకాష్ జైస్వాల్ తెలిపారు. శుక్రవారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిందని, ఆ తర్వాత మేనిఫెస్టోపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు, విలేకరుల సమావేశం అనంతరం అనిల్ సింగ్ మాట్లాడుతూ.. తాను పార్టీతోనే కొనసాగుతానని చెప్పారు. పార్టీ సమావేశాల్లో ఈ విషయం బయటికి చెప్పనప్పటికీ టికెట్ రాలేదన్న అసంతృప్తితోనే రాజకీయ సన్యాసం ప్రకటించినట్లు తెలుస్తోంది.

మీడియాతో అనిల్ సింగ్ మేజర్ మాట్లాడుతూ ‘‘నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడిని. సభ్యుడి కొనసాగుతాను. నేను ఎల్లప్పుడూ బీజేపీ భావజాలంతో ముడిపడి ఉంటాను. కానీ నేను సాధారణ కార్యకర్తగానే ఉంటాను. ఈరోజు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేశాను. ఇకపై కూడా చేస్తాను. ఈరోజు నా మనసులో ఏముందో చెప్పాను’’ అని అన్నారు.