Assembly Elections 2023: ఎట్టకేలకు దిగివచ్చిన బీజేపీ హైకమాండ్.. సీఎం అభ్యర్థి ఆమేనని హింట్ ఇచ్చారా?

తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది.

Assembly Elections 2023: ఎట్టకేలకు దిగివచ్చిన బీజేపీ హైకమాండ్.. సీఎం అభ్యర్థి ఆమేనని హింట్ ఇచ్చారా?

Updated On : October 23, 2023 / 6:47 PM IST

Rajasthan Politics: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తలా రెండు అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. మొత్తం రెండు వందల సీట్లలో బీజేపీ ఇప్పటి వరకు 124 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అదే సమయంలో కాంగ్రెస్ 76 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది. అయితే మొదటి జాబితా నిరసన గళాన్ని శాంతింపజేసేందుకు రెండో జాబితాలో మార్పులు చేశారు. ఈ జాబితాలో రాష్ట్రంలోని పెద్ద నేతలందరికీ టికెట్లు ఇచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మద్దతుదారులకు కూడా టికెట్లు ఇచ్చారు. దీని ద్వారా వసుంధర ఇంకా సీఎం రేసులోనే ఉందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చేయడం ద్వారా బలమైన వసుంధర శిబిరం పార్టీని గెలిపించే పనిలో నిమగ్నమై ఉంటుంది.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: కాంగ్రెస్ అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారు? పెద్ద విషయమే వెల్లడించిన దిగ్విజయ్ సింగ్

తొలిజాబితాలో ఏడుగురు ఎంపీలకు టికెట్లు ఇవ్వడం ఆ పార్టీ నేతల్లో దుమారం రేపగా, రెండో జాబితాలో ఒక్క ఎంపీకి కూడా టికెట్ ఇవ్వలేదు. సర్వేల ఆధారంగా బీజేపీ తొలి జాబితాలో పేర్లను ఖరారు చేసింది. దీని వల్ల నష్టాన్ని పసిగట్టిన బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతల సలహాతో రెండో జాబితాను పూర్తిగా సిద్ధం చేసింది. బీజేపీ తొలి జాబితాలో తిజారా, బనాసూర్, సంచోర్, ఝోత్వారా, బస్సీ, డియోలీ-ఉనియారా, కిషన్‌గఢ్, నగర్, కోట్‌పుట్లీ, కెక్డీ, అల్వార్ సిటీ అభ్యర్థులకు వ్యతిరేకంగా గత 15 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం విడుదల చేసిన జాబితాలో చిత్తోర్‌గఢ్‌, సుర్‌సాగర్‌, రాజ్‌సమంద్‌, బీవార్‌, సంగనేర్‌ స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించిన పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.

బీజేపీ రెండు జాబితాలను చూస్తుంటే 2003 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు నచ్చిన నేతలకు వసుంధర టిక్కెట్లు ఇచ్చిన తీరు ఏంటో చెప్పొచ్చు. ఆమె రాణించకపోయినా ఇప్పటికీ ఆమె ప్రభావం ఇతర నాయకుల మీద ఎక్కువగా కనిపిస్తూనే ఉంది. ఇక, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్.. ప్రస్తుత సీటు చురు కాకుండా తారానగర్ టికెట్ పొందడంలో విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: కాంగ్రెస్ విషయంలో సర్వేలు పని చేయలేదు.. హైకమాండ్ పంపిన కమిటీ కూడా అట్టర్ ప్లాప్