Karnataka Polls: మీకు తెలుసా, కర్ణాటకలో 1999 నుంచి కాంగ్రెసే టాప్. అయినా కూడా..?

మూడుసార్లు (2003, 2008, 2018) భారతీయ జనతా పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ ముందు ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన రెండుసార్లు అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది

Karnataka Polls: మీకు తెలుసా, కర్ణాటకలో 1999 నుంచి కాంగ్రెసే టాప్. అయినా కూడా..?

Updated On : May 11, 2023 / 8:49 PM IST

Karnataka Polls: 20 ఏళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అత్యధిక ఓట్లు సంపాదిస్తూ వస్తోంది. అయినప్పటికీ కేవలం రెండుసార్లు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యూనియన్ కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వచ్చినప్పటికీ సీట్లలో మాత్రం తేడా వస్తోంది. 1999-2018 మధ్య ఐదుసార్లు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు సార్లు (1999, 2013) మాత్రమే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Karnataka Polls: షెట్టర్ కష్టమే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం మళ్లీ ఓడిపోతారట?

మూడుసార్లు (2003, 2008, 2018) భారతీయ జనతా పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ ముందు ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన రెండుసార్లు అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. బీజేపీ గెలిచిన మూడుసార్లు మెజారిటీ మార్క్ రాలేదు. ఈ లెక్కన చూస్తే కన్నడ ఓటర్లు నిజానికి కాంగ్రెస్ వైపే ఉన్నప్పటికీ.. వాటిని సీట్లుగా మలుచుకోవడంలో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

1999
కాంగ్రెస్ – సీట్లు 132, ఓటు శాతం 40.84
బీజేపీ – సీట్లు 44, ఓటు శాతం 20.69
జేడీఎస్ – సీట్లు 10, ఓటు శాతం 10.42

2003
కాంగ్రెస్ – సీట్లు 65, ఓటు శాతం 35.27
బీజేపీ – సీట్లు 79, ఓటు శాతం 28.33
జేడీఎస్ – సీట్లు 58, ఓటు శాతం 20.77

2008
కాంగ్రెస్ – సీట్లు 80, ఓటు శాతం 34.76
బీజేపీ – సీట్లు 110, ఓటు శాతం 33.86
జేడీఎస్ – సీట్లు 28, ఓటు శాతం 18.96

2013
కాంగ్రెస్ – సీట్లు 122, ఓటు శాతం 36.6
బీజేపీ – సీట్లు 40, ఓటు శాతం 19.9
జేడీఎస్ – సీట్లు 40, ఓటు శాతం 20.2

2018
కాంగ్రెస్ – సీట్లు 80, ఓటు శాతం 38.14
బీజేపీ – సీట్లు 104, ఓటు శాతం 36.35
జేడీఎస్ – సీట్లు 37, ఓటు శాతం 18.3

ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ సహా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి అటుఇటుగా 40 శాతం ఓటు బ్యాంకుతో మెజారిటీ మార్క్ స్థానాలు గెలుస్తుందని వెల్లడించాయి. ఇక సిద్ధరామయ్య ఉన్న సమయంలో రాష్ట్రంలో జేడీఎస్ క్రమంగా పైకి లేచినప్పటికీ.. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాగానే క్రమంగా దాని ప్రభావం తగ్గుతూ వచ్చింది.