Gujarat Elections: ఎన్నికల ముందు బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి
వ్యాస్ సమర్పించిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం, వ్యాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధ్‌పూర్ నియోజకవర్గంలో తనకే అత్యధిక ప్రజాదరణ ఉందని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వ్యాస్ చెప్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఏడుసార్లు పోటీ చేసి, నాలుగుసార్లు విజయం సాధించారు

Ex-minister who shocked BJP
Gujarat Elections: గుజరాత్ శాసన సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జయ్ నారాయణ్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో ఇంకా స్పష్టంగా వెల్లడించడం లేదు. అయితే ఏ పార్టీలో చేరతారనే విషయం ఆయన స్పష్టం చేయలేదు. నారాయణ్ వ్యాస్ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాను బీజేపీతో విసిగిపోయానని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయని, శాసన సభ ఎన్నికల్లో సిద్ధ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
కాగా, వ్యాస్ సమర్పించిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం, వ్యాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధ్‌పూర్ నియోజకవర్గంలో తనకే అత్యధిక ప్రజాదరణ ఉందని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వ్యాస్ చెప్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఏడుసార్లు పోటీ చేసి, నాలుగుసార్లు విజయం సాధించారు. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చందాజీ ఠాకూర్ గెలిచారు.
Barley Payasam : శారీరక,మానసిక సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వారానికి ఒకసారి బార్లీ పాయసంతో!