INDIA Bloc: డ్యామేజీ కంట్రోల్ చేసేందుకు అప్రమత్తమై కాంగ్రెస్.. రంగంలోకి ఖర్గే, నితీశ్‭కు మొదటి కాల్

ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి

INDIA Bloc: డ్యామేజీ కంట్రోల్ చేసేందుకు అప్రమత్తమై కాంగ్రెస్.. రంగంలోకి ఖర్గే, నితీశ్‭కు మొదటి కాల్

Updated On : November 4, 2023 / 3:40 PM IST

Kharge to Nitish: ఇండియా పేరుతో చాలా విపక్ష పార్టీలు ఒకతాటిపైకి వచ్చాయి. అందరూ కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించాలని తీర్మానించాయి. కానీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీలను వదిలేసి కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‭వాదీ పార్టీ పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పైగా ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆ పార్టీ అఖిలేష్ ప్రకటించారు. ఆయన ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించింది.

ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి. ఇది గమనించిన ఆ పార్టీ జరిగిన మరింత డ్యామేజీ జరగకుండా జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున వెంటనే రంగంలోకి దిగి తొలుత నితీశ్ కుమార్ తో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే విపక్ష పార్టీలతో కలిసి ర్యాలీలు నిర్వహించనున్నట్లు నితీశ్ తో ఖర్గే చెప్పినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ తీరు పట్ల మిగిలిన విపక్ష పార్టీలన్నీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే ఎస్పీ దూరమైంది. ఆప్ సైతం దూరంగానే ఉంటోంది. వాస్తవనానికి విపక్షాల ఐక్యతకు కృషి చేసి, అందరినీ ఏకతాటిపైకి తెచ్చింది నితీశ్ కుమార్. దీంతో డ్యామేజీ కంట్రోల్ కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బలాబలాలను బట్టి పొత్తుల గురించి చర్చించాలని కాంగ్రెస్ అనుకుంటోందని కొందరు అంటున్నారు.