Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‭కు సర్వం సిద్ధం.. ఉదయం 9 లోపే మొదటి ఫలితం

ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్‭కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండులో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది

Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‭కు సర్వం సిద్ధం.. ఉదయం 9 లోపే మొదటి ఫలితం

munugode by poll counting begins from tomorrow 8am

Updated On : November 5, 2022 / 9:31 PM IST

Munugode By Poll: గురువారం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. మొత్తం 15 రౌండ్లలో జరగనున్న ఈ లెక్కింపులో మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకే రానుంది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మొత్తం 75 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొననున్నారు. ఈవీఎంలు అందించడం సహా ఇతర అవసరాల నిమిత్తం మరో 300 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1 లోపు పూర్తి ఫలితాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మొదట పోలింగ్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరుస్తారు. 21 టేబుళ్ల మీద లెక్కింపు జరుగుతుందట. గంటలో నాలుగు రౌండ్ల లెక్కింపు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్‭కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండులో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో టేబులుకు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‭లను నియమించారు.

ఇక రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు భాస్కర్ రావు, రాహుల్ శర్మ, రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ పరిశీలించారు. కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

Metpally Children Kidnap Case : వార్నీ.. ఏం పిల్లలు రా.. కరాటే క్లాసులు తప్పించుకునేందుకు కిడ్నాప్ డ్రామా