Mizoram Polling: బీజేపీతో పొత్తు కేంద్రంలోనే, రాష్ట్రంలో ఉండదు.. పోలింగ్ వేళ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

పొత్తు గురించి ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఈ విషయమై బీజేపీ తమను కానీ తాము బీజేపీని కానీ ఆశ్రయించలేదని అన్నారు.

Mizoram Polling: బీజేపీతో పొత్తు కేంద్రంలోనే, రాష్ట్రంలో ఉండదు.. పోలింగ్ వేళ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : November 7, 2023 / 4:55 PM IST

Assembly Elections 2023: మిజోరాం అసెంబ్లీకి మంగళవారం (నవంబర్ 7) ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పోలింగ్ కొనసాగుతుండగానే.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ చీఫ్ జోరమ్‌తంగా. ఈ ఎన్నికల్లో గెలిచి సొంతంగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 40 స్థానాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 16 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార ఎంఎన్‌ఎఫ్ సహా కాంగ్రెస్, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌లు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మంగళవారం ఐజ్వాల్ నార్త్-II సీటులో ఓటు వేయడానికి జోరమ్‌తంగా వచ్చారు. కాగా, ఓటు వేయడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ “మేము సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని విశ్వసిస్తున్నాను” అని అన్నారు. ఐజ్వాల్ నార్త్-1 స్థానం నుంచి సీఎం జోరమ్‌తంగా పోటీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: CM Jagan Photo In Voter List : అధికారులు ఇదేం పని..! ఓటర్ల జాబితాలో తప్పులు.. మహిళ స్థానంలో జగన్ ఫొటో

వాస్తవానికి బీజేపీతో కేంద్రంలో ఎమ్ఎన్ఎఫ్ పొత్తులో ఉంది. కానీ రాష్ట్రంలో (మిజోరాం) ఆ పార్టీ ఏ కూటమిలోనూ లేదు. ఎంఎన్‌పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో కాషాయ పార్టీతో పొత్తుకు సంబంధించిన ప్రశ్నకు సీఎం జోరంతంగా సమాధానం ఇస్తూ.. ‘‘మిజోరాంలో హంగ్ అసెంబ్లీ ఉండదు. ఇది ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం ఏర్పడుతుంది. దానిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక్కడ బీజేపీ పొత్తు ఉండదు. మిజోరాంలో ఏ పార్టీ మద్దతు లేకుండా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము’’ అని అన్నారు.

పొత్తు గురించి ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఈ విషయమై బీజేపీ తమను కానీ తాము బీజేపీని కానీ ఆశ్రయించలేదని అన్నారు. తాము కేంద్రంలో భాగస్వామ్యం అయినప్పటికీ రాష్ట్రంలో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మిజోరాం ఇప్పటి వరకు మయన్మార్ నుంచి 33,000 మంది, బంగ్లాదేశ్ నుంచి 800 మంది, మణిపూర్ నుంచి 13,000 మందికి పైగా శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిందని ఆయన చెప్పారు. ఎంఎన్‌ఎఫ్‌ గెలుపులో శరణార్థుల సమస్య కీలక పాత్ర పోషిస్తుందని సీఎం జోరమ్‌తంగా అన్నారు.

ఇది కూడా చదవండి: Wealth Survey in Bihar: 18 ఏళ్ల పాలనపై ఆర్థిక రిపోర్ట్ విడుదల చేసిన నితీశ్.. రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య తెలిస్తే ఖంగితింటారు