CM Jagan Photo In Voter List : అధికారులు ఇదేం పని..! ఓటర్ల జాబితాలో తప్పులు.. మహిళ స్థానంలో జగన్ ఫొటో

గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.

CM Jagan Photo In Voter List : అధికారులు ఇదేం పని..! ఓటర్ల జాబితాలో తప్పులు.. మహిళ స్థానంలో జగన్ ఫొటో

CM Jagan

AP CM Jagan Photo : ఏపీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అధికారుల తప్పిదంతో ఓటర్ లిస్టులో మహిళ ఫొటో స్థానంలో ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో వచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్లును చెక్ చేసుకొనే సమయంలో సీఎం ఫొటోను చూసి సదరు మహిళతోపాటు స్థానికులు కంగుతిన్నారు. మహిళ ఫొటో ఉండాల్సిన ప్లేస్ లో అధికారులు ఏకంగా సీఎం జగన్ ఫొటో పెట్టడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

Also Read : YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాది.. షర్మిలను బహిష్కరిస్తున్నాం..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దొర్నాల మండలం వై చెర్లోపల్లి గ్రామ ఓటరు లిస్టులో ఈ తప్పిదం జరిగింది. గ్రామంకు చెందిన జనపతి గురవమ్మ అనే మహిళా ఓటర్ ఫొటో ఉండాల్సిన స్థానంలో జగన్ ఫొటోను అధికారులు ముద్రించారు. గురవమ్మ ఓటర్ లిస్ట్ చూసుకునే సమయంలో తన పేరు వద్ద జగన్ ఫొటో ఉండటాన్నిచూసి కంగుతింది. తన ఫొటో కాకుండా జగన్ ఫొటో రావడం ఏమిటని అధికారులను ప్రశ్నించింది. ఈ విషయంపై అధికారులను స్థానికులు ప్రశ్నించగా.. బీఎల్వో తప్పిదంతోనే ఇలా జరిగి ఉంటుందని చెప్పారని స్థానికులు పేర్కొన్నారు.

Also Read : Telangana BJP: 12మందితో తెలంగాణ బీజేపీ నాలుగో జాబితా విడుదల

అయితే, ఇదే గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నాయి.