Telangana BJP: 12మందితో తెలంగాణ బీజేపీ నాలుగో జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నాలుగో విడుత అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 12 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను

Telangana BJP: 12మందితో తెలంగాణ బీజేపీ నాలుగో జాబితా విడుదల

Telangana BJP

Updated On : November 7, 2023 / 12:18 PM IST

BJP MLA Candidates 4th List Releases : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నాలుగో విడుత అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 12 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యాలయం ఇన్ ఛార్జి అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన సుభాష్ రెడ్డి (ఎల్లారెడ్డి), చలమల్ల కృష్ణారెడ్డి (మునుగోడు)లకు బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతల మధ్య సీట్ల కేటాయింపు పై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. జనసేనకు ఇచ్చే స్థానాలు మినహా 19 స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. అయితే, ఇప్పటి వరకు జనసేనకు ఏఏ నియోజకవర్గాలు కేటాయిస్తున్నారు? ఎన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. ఈరోజు జనసేనకు ఇచ్చే స్థానాలపై స్పష్టత వస్తుందని ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ భేటీలో సీట్ల అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Also Read : Bandi Sanjay : కేసీఆర్ కు అలా చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? దొంగలంతా అందులోనే ఉన్నారు

బీజేపీ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 52 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. రెండో విడతలో ఒక్కరి పేరుతో జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. మూడో విడతలో 35 మందితో అభ్యర్థులను ప్రకటించగా.. నాల్గో విడతలో 12మందితో జాబితాను మంగళవారం బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. నాలుగు విడతల్లో మొత్తం 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో ఎస్సీ 16, ఎస్టీలకు 10 సీట్లను బీజేపీ అధిష్టానం కేటాయించింది.

Also Read : Telangana Congress Third List : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

12 మంది అభ్యర్ధులు వీరే..
చెన్నూరు (ఎస్సీ) – దుర్గం అశోక్
ఎల్లారెడ్డి – వి.సుభాష్ రెడ్డి
వేములవాడ – తుల ఉమ
హస్నాబాద్ – శ్రీరాం చక్రవర్తి
సిద్ధిపేట – దూది శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్ కుమార్
కొడంగల్ – బంటు రమేష్ కుమార్
గద్వాల్ – బోయ శివ
మిర్యాలగూడ – సాధినేని శ్రీనివాస్
మునుగోడు – చలమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) – ఎస్. మొగులయ్య
ముగులు (ఎస్టీ) – అజ్మీరా ప్రహ్లాద్ నాయక్