Wealth Survey in Bihar: 18 ఏళ్ల పాలనపై ఆర్థిక రిపోర్ట్ విడుదల చేసిన నితీశ్.. రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య తెలిస్తే ఖంగితింటారు

ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల 282 కాగా, అందులో 25.09 శాతం కుటుంబాలు పేదలే.

Wealth Survey in Bihar: 18 ఏళ్ల పాలనపై ఆర్థిక రిపోర్ట్ విడుదల చేసిన నితీశ్.. రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య తెలిస్తే ఖంగితింటారు

బిహార్ ముఖ్యమంత్రిగా గత 18 ఏళ్లుగా నితీశ్ కుమార్ నిరాటకంగా పాలిస్తున్నారు. ఇందులో ఎక్కువ సమయం భారతీయ జనతా పార్టీతో మిగిలిన సమయం రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలతో పొత్తులో ఉన్నారు. కాగా, 18 ఏళ్ల తన పాలనలో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థులపై ఆయన స్వయంగా రిపోర్టు విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా మంగళవారం ఆర్థిక సర్వే ఫలితాలు విడుదల చేశారు. బీహార్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి.

రాష్ట్రంలోని 2 కోట్ల 76 లక్షల 68 వేల 930 కుటుంబాలో 94 లక్షల 42 వేల 786 కుటుంబాలు అంటే 34.13 శాతం కుటుంబాలు నిరుపేదలేనని ఈ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర జనాభాను ప్రధానంగా ఐదు కేటగిరీలుగా విభజించి నిర్వహించిన ఈ సర్వేలో.. షెడ్యూల్డ్ కులాల్లోనే అత్యధిక నిరుపేదలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల్లో 42.93 శాతం మంది నిరుపేదలేనట. ఇక అత్యాల్పంగా జనరల్ కేటగిరీకి చెందిన వారు 25.09 శాతం నిరుపేదలుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: CM Jagan Photo In Voter List : అధికారులు ఇదేం పని..! ఓటర్ల జాబితాలో తప్పులు.. మహిళ స్థానంలో జగన్ ఫొటో

అక్టోబర్ 02 గాంధీ జయంతి రోజున నితీష్ ప్రభుత్వం కులగణన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భాగంగానే తాజా ఆర్థిక సర్వే నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం.. బీహార్‌లో అత్యధికంగా 98 లక్షల 84 వేల 904 కుటుంబాలు వెనుకబడిన కులాలకు చెందినవి. అందులో 33.58 శాతం అంటే 33 లక్షల 19 వేల 509 కుటుంబాలు పేదలు. కుటుంబాల సంఖ్య పరంగా వెనుకబడిన తరగతులు రెండవ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో 74 లక్షల 73 వేల 529 వెనుకబడిన తరగతుల కుటుంబాలు ఉండగా, అందులో 33.16 శాతం అంటే 24 లక్షల 77 వేల 970 కుటుంబాలు పేదలు. మూడవ స్థానంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాల సంఖ్య ఉంది. రాష్ట్రంలో 54 లక్షల 72 వేల 024 షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు ఉండగా.. అందులో 42.93 శాతం అంటే 23 లక్షల 49 వేల 111 కుటుంబాలు నిరుపేదలు.

ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల 282 కాగా, అందులో 25.09 శాతం కుటుంబాలు పేదలే. అంటే జనరల్ కేటగిరీలో ఉన్నప్పటికీ 10 లక్షల 85 వేల 913 కుటుంబాలు నిరుపేదలు. ఐదు ప్రధాన వర్గాలు కాకుండా.. ఇతర గుర్తింపు పొందని కులాలను కూడా లెక్కించారు. ఈ కుటుంబాల సంఖ్య 39 వేల 935గా పేర్కొన్నారు. అయితే వీరిలో 23.72 శాతం అంటే 9474 కుటుంబాలు నిరుపేదలని సర్వే వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay : కేసీఆర్ కు అలా చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? దొంగలంతా అందులోనే ఉన్నారు