2024 Elections: మూడోసారి బీజేపీయేనట.. ఈసారి మరింత బంపర్ మెజారిటీ అంటున్న లేటెస్ట్ సర్వే

ఓ సర్వే ఇండియా కూటమికి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. మరోసారి ప్రధాని మోదీ, సీఎం యోగి మ్యాజిక్‌ ఫలిస్తున్నట్లు సర్వేలో తేలింది.

2024 Elections: మూడోసారి బీజేపీయేనట.. ఈసారి మరింత బంపర్ మెజారిటీ అంటున్న లేటెస్ట్ సర్వే

Updated On : August 6, 2023 / 9:05 PM IST

BJP: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీల సన్నాహాలు మొదలయ్యాయి. అన్ని పార్టీలు తమ వ్యూహరచన చేస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ప్రధాన పోటీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా మధ్య ఉండనుందనేది స్పష్టం. దేశం సంగతి కాసేపు పక్కన పెడితే.. పార్లమెంటుకు ప్రధాన మార్గమైన ఉత్తరప్రదేశ్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత రెండు దఫాల్లో ఆ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి కూడా బంపర్ మెజారిటీ సాధిస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది.

Pakistan Train Accident: పాకిస్తాన్‭లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా కొట్టిన 10 బోగీలు, 25 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఓ సర్వే ఇండియా కూటమికి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. యూపీలో మరోసారి ప్రధాని మోదీ, సీఎం యోగి మ్యాజిక్‌ ఫలిస్తున్నట్లు సర్వేలో తేలింది. 2019 నాటి కంటే ఎక్కువ సీట్లు ఈసారి బీజేపీ గెలుచుకుంటుందట. 2014 ఫలితాన్ని పునరావృతం చేస్తుందని సర్వే పేర్కొంది.

Musk vs Zuck: ఫేస్‭బుక్ బాస్ జూకర్‌బర్గ్‭తో కేజ్ ఫైట్ ప్రకటించిన మస్క్.. ట్విటర్‭లో లైవ్ వస్తుందట

కూటమి సీట్లతో పాటు ఓట్ల షేరింగ్‌లోనూ భాజపా దూసుకెళ్తోందని సర్వేలో తేలింది. యూపీలో బీజేపీ ఒంటరిగానే 70 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది. అదే సమయంలో ఇండయా కూటమి కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మూడు స్థానాలు బీజేపీ మిత్రపక్షాలకు దక్కే అవకాశం కనిపిస్తోంది. యూపీలో ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని సర్వే పేర్కొంది. అయితే, కాంగ్రెస్‌తో పాటు కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ వంటి యూపీ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా బీఎస్పీ ఖాతా తెరవదట. గత ఎన్నికల్లో బీఎస్పీ 10 స్థానాలను కైవసం చేసుకుంది.

UP Politics: ఉత్తరప్రదేశ్‭లో బీఎస్పీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం.. మోదీ సభలోనే బాహాబాహి

ఎన్డీయే కూటమిలో బీజేపీకి 70, అప్నాదళ్ (ఎస్)కి 2, ఎస్బీఎస్పీకి 1 సీటు వస్తుందని సర్వేలో తేలింది. అదే సమయంలో ఇండియా కూటమిలో పాల్గొన్న ఎస్పీకి 4, కాంగ్రెస్‌కు 2, ఆర్‌ఎల్‌డీకి ఒక సీటు గెలుస్తాయట. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకు గాను బీజేపీ 71 సీట్లు, 2019లో 62 సీట్లు సాధించింది. సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 52 శాతం, ఇండియా కూటమికి 28 శాతం, బీఎస్పీకి 11 శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తున్నాయని తెలిపారు.