Bengal Politics: మమతా బెనర్జీకి చుక్కెదురు.. హైకోర్టు ఉత్తర్వుల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు

నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్‌ సీపీ ఆనంద బోస్‌కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను మోహరించడానికి అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు ఈనెల 15న తీర్పునిచ్చింది

Bengal Politics: మమతా బెనర్జీకి చుక్కెదురు.. హైకోర్టు ఉత్తర్వుల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు

mamata banerjee

Updated On : June 20, 2023 / 5:42 PM IST

Supreme Court: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‭కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా సవాలు చేస్తూ సుప్రీం తలుపు తట్టారు. అయితే మమతా సవాలును సుప్రీం తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలన్నదే హైకోర్టు ఉద్దేశమని మంగళవారం సుప్రీం పేర్కొంది.

Heat Waves: వేడిగాలులపై కేంద్రం హైలెవల్ సమావేశం.. రాష్ట్రాల్లో పర్యటనకు ప్రత్యేక బృందం

పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్‌ సీపీ ఆనంద బోస్‌కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను మోహరించడానికి అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు ఈనెల 15న తీర్పునిచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర పోల్ ప్యానల్ గుర్తించిన సున్నితమైన ఏడు జిల్లాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను తప్పనిసరిగా మోహరించాలని ఆదేశించింది.

Free Gurbani Telecast Bill: పంతం నెగ్గించుకున్న భగవంత్ మాన్.. గోల్డెన్ టెంపుల్ గుర్బానీ బిల్లును ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ

స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసు బలగాలతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికలను మోహరించాలని, కోరాలని తాము భావిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు అంతిమ ఉద్దేశం కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, జరగడడమేనని సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ సందర్భంగా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేస్తూ, బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్లను కొట్టివేసింది. జూలై 8న పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.