Heat Waves: వేడిగాలులపై కేంద్రం హైలెవల్ సమావేశం.. రాష్ట్రాల్లో పర్యటనకు ప్రత్యేక బృందం
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రానున్న కొన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన, అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది

Union Health Minister chairs high level meeting to review preparedness for heatwaves
High Level Meet: దేశంలో అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో ఉన్న వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో హైలెవల్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. వేడి తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐఎండి విభాగానికి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
తీవ్రంగా వేడి ప్రభావితమైన రాష్ట్రాలను ఈ బృందం సందర్శిస్తుందని మన్సుఖ్ మాండవియా తెలిపారు. వేడి గాలులు, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను సూచించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ని కూడా ఆదేశించినట్లు మాండవీయ పేర్కొన్నారు. వేడి తీవ్రత ప్రభావం సాధారణ ప్రజలపై చూపకుండా ఉండేందుకు తగిన సూచనలు, సలహాలు చెప్పాలని ఐసీఎంఆర్ని కేంద్రం కోరింది.
PM Modi US Visit: ఎలాన్ మస్క్‌ను కలుసుకోనున్న ప్రధాని మోదీ.. ట్విటర్ సొంతమైన తర్వాత ఇదే తొలి కలయిక
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రానున్న కొన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన, అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులు, వాతావరణ పరిస్థితి కారణంగా మరణాలు నమోదు కావడంతో కేంద్రం ఈ చర్యలు మోదలు పెట్టింది.