Karnataka Polls: టిప్పు సుల్తాన్ జయంతి చేస్తాం, ముస్లిం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు

కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది

Karnataka Polls: టిప్పు సుల్తాన్ జయంతి చేస్తాం, ముస్లిం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు

Siddaramaiah

Updated On : April 22, 2023 / 9:34 PM IST

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన హామీలు ఇచ్చింది. గతంలో రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ జయంతి అధికారికంగా జరిగేది. అయితే కొద్ది నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇక కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్‭ను సైతం రద్దు చేసింది. అయితే ఈ రెండింటినీ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తాము కనుక మళ్లీ అధికారంలోకి వస్తే టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‭ను పునరుద్దరిస్తామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు.

Rahul Gandhi: అధికారిక నివాసం తాళాలు అప్పగించి, ప్రజలకు థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ

జాతీయ ఛానల్ ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం సిద్ధరామయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నేను నియంతని కాదు, నేను ప్రజాస్వామ్యవాదిని. మంత్రులందరి అభిప్రాయాన్ని తీసుకొని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాము’’ అని అన్నారు. కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అనంతరం 2019లో బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది.