JP Nadda: మేము పాలించమని ప్రజలకు చెప్పాము.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నడ్డా

రాష్ట్రంలోకి కొన్ని కొత్త పార్టీలు చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అలా చాలా మంది వచ్చి వెళ్లారని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి నడ్డా అన్నారు. అలాంటి వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి వెళ్తుంటారని, వారిని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఎన్నికలకు ముందు వచ్చి ఎన్నికలు ముగియగానే వారు రాష్ట్రంలో కనిపించరని, కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని నడ్డా అన్నారు.

JP Nadda: మేము పాలించమని ప్రజలకు చెప్పాము.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నడ్డా

told the people of himachal that we will not rule says nadda

Updated On : October 30, 2022 / 7:32 PM IST

JP Nadda: తాము ప్రజల్ని పాలించడానికి అధికారంలోకి రామని, వారి ఆచారాలను మార్చడానికి అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులులో ఆదివారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో స్థానిక అక్కడి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ వెంటే ఉంటారని, వారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయని నడ్డా అన్నారు.

కానీ రాష్ట్రంలోకి కొన్ని కొత్త పార్టీలు చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అలా చాలా మంది వచ్చి వెళ్లారని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి నడ్డా అన్నారు. అలాంటి వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి వెళ్తుంటారని, వారిని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఎన్నికలకు ముందు వచ్చి ఎన్నికలు ముగియగానే వారు రాష్ట్రంలో కనిపించరని, కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని నడ్డా అన్నారు.

Prajarajyam Party : ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం.. చిరంజీవి ఫొటోతో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతల కీలక భేటీ.. ఏం జరుగుతోంది?