Prajarajyam Party : ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం.. చిరంజీవి ఫొటోతో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతల కీలక భేటీ.. ఏం జరుగుతోంది?

తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.

Prajarajyam Party : ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం.. చిరంజీవి ఫొటోతో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతల కీలక భేటీ.. ఏం జరుగుతోంది?

Updated On : October 30, 2022 / 5:40 PM IST

Prajarajyam Party : తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు. చిరంజీవి ఫొటోతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

రేపు రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల భేటీతో తిరుపతి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీ-జనసేన పొత్తు వార్తలతో రెండు పార్టీల్లోని బలిజ సామాజికవర్గం నేతలు ఏకమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మరిన్ని చోట్ల ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే తిరుపతిలో భేటీ అయ్యామని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీడీపీ-జనసేన పొత్తు వార్తలతో, రెండు పార్టీల్లోని బలిజ సామాజికవర్గం నేతలు ఏకమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ-జనసేన పొత్తుల చర్చలు, రేపు రాజమండ్రిలో జరిగే కాపు నేతల సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు స్పష్టం చేశారు.

ఆత్మీయ కలయిక పేరుతో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు తిరుపతిలో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. టీడీపీ, బీజేపీ, జనసేనలోని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరవడం ఆసక్తికరంగా మారింది. అన్ని సామాజికవర్గాల సమాహారం ప్రజారాజ్యం అని ఈ సమావేశ నిర్వహకులు తెలిపారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అంతా ఈ సమావేశానికి వచ్చారని చెప్పారు. ఇది క్యాస్ట్ సంబంధించిన సమావేశం కాదన్నారాయన. ప్రజాస్వామ పరిరక్షణ ధ్యేయంగా ఈ సమావేశం జరిగిందన్నారు. పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలందరిని ఒకటి చేయాలనే ఈ మీటింగ్ పెట్టామన్నారు.