Ahmedabad Plane Crash: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని!
గుజరాత్ అహ్మదాబాదులో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టును డీ కొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కి ఫోన్ చేసి ఆరాతీస్తున్నారు.