ధనత్రయోదశి మెరుపు… లక్ష కోట్ల షాపింగ్.. అదృష్టం అంటే వీళ్లదే భయ్యా
ఈ ధనత్రయోదశి దేశవ్యాప్తంగా పండుగ శోభను రెట్టింపు చేసింది! కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, వినియోగదారులు దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర షాపింగ్ చేసి రికార్డు సృష్టించారు. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, కొనుగోళ్లు జోరుగా సాగాయని CAIT వెల్లడించింది. పండుగ సందర్భంగా బంగారం, వెండి అమ్మకాలు ఏకంగా 60 వేల కోట్ల రూపాయలు దాటాయని CAIT తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 25% అధికం కావడం విశేషం. వెండి ధరలు పెరిగినప్పటికీ, డిమాండ్ ఏ మాత్రం తగ్గకుండా భారీ కొనుగోళ్లు జరిగాయని నివేదించింది. CAIT సెక్రటరీ జనరల్ ఎం.పి. ప్రవీణ్ ఖండేల్‌వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయని తెలిపారు. దీనివల్ల చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, తయారీదారులకు గణనీయమైన ప్రయోజనం చేకూరిందని ఆయన అన్నారు.