ప్రధాని మోదీ హత్యకు కుట్ర? సీఐఏ ప్రమేయం? సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న సంచలన కథనాలు!
ప్రధాని నరేంద్ర మోదీని హత్యా చేయడానికి భారీ కుట్ర జరిగిందా? అందులో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) ప్రమేయం ఉందా? ఆ కుట్రను భారత్, రష్యా దేశాలు కలిసి భగ్నం చేశాయా? — ఇవే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సంచలన కథనాల వెనుక ఎంతవరకు నిజం ఉందనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ఈ చర్యను ఆపాలని పదేపదే కోరినా భారత్ తన నిర్ణయానికి కట్టుబడింది. ఈ పరిణామాల మధ్యే మోదీని హత్య చేసేందుకు పథకం వేశారని, దానిని భారత్-రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా తిప్పికొట్టాయని ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలో భారత్ వేగంగా సూపర్ పవర్‌గా ఎదుగుతుండడాన్ని చూసి కొన్ని దేశాలు అసూయపడుతున్నాయనే వాదనలు ఈ కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. చైనాలో జరిగిన SCO సదస్సులో భారత ప్రధాని, రష్యా అధ్యక్షులు ఒకే కారులో సుదీర్ఘంగా చర్చించడం కూడా ఈ కథనాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ చర్చలు కేవలం సాధారణ సమావేశంలో భాగమేనా, లేక కీలక పరిణామాలపైనా అని సోషల్ మీడియాలో విశ్లేషణలు నడుస్తున్నాయి.






