ఎక్కడి నుండి వచ్చారో తెలియదు.. కాశీబుగ్గ టెంపుల్ ఓనర్ హరిముకుంద్ ఏం చెప్పారంటే..!
మామూలుగా రోజుకు 3000-4000 మంది భక్తులు వస్తుంటారు. కానీ ఈరోజు అంచనాలకు మించి, ఏకకాలంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా భక్తులు ప్రశాంతంగా పూజలు చేసి, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఈరోజు ఒక్కొక్కరే కాకుండా, పెద్ద సంఖ్యలో భక్తులు ప్రవేశించారు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, కానీ జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారని ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా అన్నారు.
