లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు Y కేటగిరీ భద్రత.. కేంద్రం ప్లాన్ ఇదే!

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించనుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల మేరకు, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అనే ఇద్దరు మాజీ మావోయిస్టు నేతలకు వై క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి లొంగిపోయిన ఈ అగ్రనేతలకు ఇటీవల రోజులుగా తీవ్ర హెచ్చరికలు వస్తున్నాయి. ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ పార్టీ విడుదల చేసిన లేఖల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియో చూడండి