హైదరాబాద్ టెకీ కలిసిన ఆ 36 మందికి కరోనా సోకింది!

ప్రపంచ దేశాలకు పరిమితమైన కరోనా వైరస్ (COVID-19) భారత్ పై పంజా విసిరింది. క్షణం క్షణం భయంభయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ టెకీకి సోకిన ఈ కరోనా మహహ్మారి ఎవరిరూపంలో ఎవరికి వ్యాపిస్తుందోనన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. వైరస్ సోకినన బాధితుడు హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటినుంచి దాదాపు 88 మందిని కలిసినట్టు చెబుతున్నారు. వీరిలో ఎంతమందికి కరోనా వైరస్ సోకి ఉంటుంది అనేదానిపై సర్వత్ర ఆందోళన నెలకొంది.
దుబాయ్ నుంచి తిరిగి హైదరాబాద్ కు వచ్చిన 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎవరెవరితో కలిశాడు? ఇప్పటివరకూ ఎంతమందికి ఈ వైరస్ సోకింది అనేది భయాందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆ టెకీ కలిసిన మొత్తం 88 మందిని ఎట్టకేలకు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో మొత్తం 88 మందిలో 33 మందికి కొన్ని వైరస్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించినట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
టెకీ కలిసిన వారిలో 45 మందిని ముందు జాగ్రత్త చర్యగా సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ వారిని వారి ఇళ్లల్లోనే ప్రత్యేక గదుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం నాటికి నగరంలో మొత్తం 36 మందికి కరోనా వైరస్ సోకినట్టు అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ 36 మంది వైరస్ బాధితులు కూడా హైదరాబాద్ టెకీతో కలిసి బస్సులో ప్రయాణించివారే.. వీరంతా బెంగళూరు నుంచి తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చినవారేనని కరోనా వైరస్ డిటెక్షన్ స్టేట్ నోడల్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. (కరోనా: వర్కర్స్ కోసం చైనా మాల్స్ ఫ్రీగా డ్రింక్స్..స్నాక్స్)
వైరస్ లక్షణాలుగా కనిపిస్తున్న ఈ 36 మందిలో కచ్చితంగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించలేమని, వారి శాంపిల్స్ పరీక్షల్లో నెగటీవ్ గా కూడా మారే అవకాశం ఉందన్నారు. బెంగళూరులోని శివారు ప్రాంతంలో ఓ పీజీ అకాడమేషన్ ఉంటున్న ఈ హైదరాబాద్ టెకీ.. టెక్ పార్క్ లో ఐటీ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాడు.
ఫిబ్రవరి 15న కంపెనీ ప్రాజెక్ట్ నిమిత్తం దుబాయ్ వెళ్లి ఫిబ్రవరి 20న బెంగళూరుకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు ఆఫీసులో ఫిబ్రవరి 20, 21 తేదీల్లో అక్కడే ఉన్నాడు. హైదరాబాద్ కు బస్సులో రాకముందు బెంగళూరు ఆఫీసులోనే ఉన్నాడు. నగరానికి వచ్చిన సందర్భంగా అతడికి టెస్టులు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది.