లాక్‌డౌన్.. శృంగారానికి ఇదే సరైన సమయం ఎందుకో ఈ 4 కారణాలు తెలుసుకోవాల్సిందే

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ పుణ్యానా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కావాల్సినంత సమయం.. ఎన్ని పనులైన చేసుకోవచ్చు. ఈ ఒక పనితో తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అదేంటో తెలుసా? రతిక్రీడ. ప్రత్యేకించి శృంగారానికి లాక్‌డౌన్ ఒకటే సరైన సమయం కూడా. ఈ సమయంలో చాలామంది రొమాన్స్‌తో ఎంజాయ్ చేస్తుంటారు.
పడక గదికే పరిమితమై పార్టనర్‌తో కలిసి రొమాన్స్‌లో రెచ్చిపోతూ శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇతర విషయాలతో పోలిస్తే.. లాక్ డౌన్ సమయాన్ని రొమాన్స్‌తో గడిపేయాలని భావిస్తున్నారా? శృంగారానికి ఇదే సరైన సమయం ఎందుకో తెలుసా? అయితే మీరు ఈ నాలుగు కారణాలు తెలుసుకోవాల్సిందే.. అవేంటో ఓసారి చూద్దాం..
1. మీకు మీరే.. ఎవరూ రారు :
లాక్ డౌన్ పరిస్థితుల్లో ఎవరి ఇంట్లో వారే ఉంటారు. తమ ఇళ్లకే పరిమతం అవుతారు. మీ ఇంటికి వచ్చే అతిథులు ఎవరూ ఉండరు. కావాల్సినంత సమయం.. ఇక పార్టనర్ ఉంటే చాలు.. రోజుంతా రెచ్చినపోవచ్చు.. మిమ్మల్ని ఆపేవారే ఉండరు. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. రొమాన్స్ కు అడ్డు ఎవరూ ఉండరు. మీకు మీరే.. పార్టనర్‌ను సంతృప్తి చెందేలా సరికొత్తగా ప్రయత్నించొచ్చు. విలువైన ఈ సమయాన్ని వృథా చేయకుండా రొమాన్స్‌తోనే రోజుంతా ఎంజాయ్ చేస్తూ గడపయేచ్చు.
2. సాన్నిహిత్యంతోనే శృంగారం :
దంపతుల మధ్య దాంపత్య జీవితం పటిష్టంగా ఉండాలంటే ఇరువురి మధ్య సాన్నిహిత్యంతో సాధ్యం. బంధం బలపడటానికి రొమాన్స్ ఎంతో కీలకం కూడా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ప్రేమను పంచుకుంటారు. అపర్థాలతో దూరమైన దంపతులు తిరిగి ప్రేమతో ఒకటైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఆ రిలేషన్ ఎంతో బలంగా ఉంటుంది. దీనికి శృంగారం తోడైతే చాలు.. ప్రతి క్షణాన్ని శృంగారాన్ని ఆస్వాదిస్తూ సుఖమైన జీవితాన్ని పొందవచ్చు.
3. అన్ని రోజులు మీవే.. క్రియేటీవ్‌గా ప్లాన్ చేసుకోండి :
రొమాన్స్‌లో కొత్తగా ఆలోచించండి.. క్రియేటీవ్ గా ప్లాన్ చేసుకోండి. లాక్ డౌన్ ఉన్న రోజులన్నీ మీవే.. ఇంట్లోనే ఉంటూ పడకగదిలో ప్రతి రోజును నచ్చిన విధంగా ఉండండి. సోమవారం వచ్చింది.. ఆఫీసులుకు వెళ్లాలని భయపడక్కర్లేదు. సోమవారం నుంచి వారమంతా నచ్చిన విధంగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కో రోజున ఒక్కోలా ప్లాన్ చేసుకోండి.
సోమవారం రోజుల్లో #MorningMondaysInBed శృంగారానికి ఎంతో అనువైన సమయం.. ఇక మంగళవారాల్లో #TuesdayNooners మధ్యాహ్నం సమయంలో రొమాన్స్‌తో రతిక్రీడను రక్తికట్టించొచ్చు. మిగిలిన రోజుల్లోనూ మీ పార్టనర్ కలిసి మరింత సమయాన్ని గడపవచ్చునని లైంగిక నిపుణులు అంటున్నారు.
4. రొమాన్స్ కు రీజన్ అక్కర్లేదు :
మీ పార్టనర్‌ను ప్రేమించడానికి కారణం కావాలా? ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడానికి కారణం ఉంటుందా? అలాగే పార్టనర్ తో శృంగారంలో పాల్గొనడానికి సరైన కారణమంటూ ఏది ఉండదు.. ఇద్దరిలో ఎవరికి శృంగార వాంఛ ఉన్నా స్వేచ్ఛగా అందులో పాల్గొనవచ్చు. ప్రేమకు కూడా ఎలాంటి రీజన్ ఉండదు. రొమాన్స్ చేసేందుకు రీజన్ కోసం వెతకాల్సిన
పనిలేదు.(ఎమ్మెల్యేలు,మంత్రుల జీతాల్లో ఏడాది పాటు 30శాతం కోత విధించిన కర్ణాటక)
మీలో శృంగార భావాలు కలిగితే అది మీ పార్టనర్ ను కూడా అందుకు ప్రేరేపిస్తుంది. ఇద్దరిలోనూ ఒకేసారి రొమాన్స్ భావన కలిగేలా మీలోని ఆ హార్మోన్లు రెచ్చగొడతాయి. అవే మీ పార్టనర్‌ను పడక గదికి వచ్చేలా ప్రేరేపిస్తుంది. ఇదే ఇరువురి మధ్య బంధానికి బలపరుస్తుంది. ఒకరిపై మరొకరికి గౌరవాన్ని పెంచుతుందని సెక్సాలిజిస్టులు చెబుతున్నారు.