12 ఏళ్లుగా రోజుకి 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు.. పనిలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు..
పనిపై దృష్టి సారించడానికి ఎంత అధిక సమయం నిద్రపోయామన్నది ముఖ్యంకాదని, అధిక నాణ్యతతో కూడిన నిద్రనే ముఖ్యమని అతడు చెప్పాడు.
Japanese Man: ప్రతిరోజు ఎనిమిది గంటల చొప్పున నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే మెదడు, శరీరం మనం చేసుకునే పనులకు సహకరించదు. అయితే, జపాన్‌లోని ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు.
అంతేగాక, అలా నిద్రపోతుండడం వల్ల తన పనిని మరింత సమర్థంగా చేసుకోగలుగుతున్నానని తెలిపాడు. పశ్చిమ జపాన్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్‌కు చెందిన ఓ సంస్థ వ్యవస్థాపకుడు డైసుకే హోరీ వయసు 40 సంవత్సరాలు. సాధారణంగా మనిషికి ఉండే ఆయుష్షు కంటే రెండు రెట్ల ఆయుష్షుతో బతకడానికి తన శరీరం, మెదడు విషయాల్లో శిక్షణ తీసుకున్నాడు.
ఈ విషయాన్ని వివరిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. సాధన చేస్తూ తన నిద్రను రోజుకు 30-45 నిమిషాలకు తగ్గించుకోగలిగాడు. పనిపై దృష్టి సారించడానికి ఎంత అధిక సమయం నిద్రపోయామన్నది ముఖ్యంకాదని, అధిక నాణ్యతతో కూడిన నిద్రనే ముఖ్యమని అతడు చెప్పాడు. 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌ను స్థాపించాడు.
అతడి వద్ద శిక్షణ పొందిన వాళ్లు కూడా నిద్ర సమయాన్ని తగ్గిస్తున్నారు. శిక్షణ తర్వాత తన నిద్రను 8 గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గించుకున్నానని అక్కడ శిక్ష తీసుకున్న ఓ యువతి తెలిపింది. నాలుగు సంవత్సరాల పాటు దానిని పాటిస్తున్నానని, తన చర్మం, మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నానని చెప్పింది.
Also Read: విజయవాడ సింగ్ నగర్‌లో కంటతడి పెట్టించే దృశ్యాలు.. ఖాళీ చేసి వెళ్లిపోతున్న వేలాది మంది ప్రజలు..