Fertility Problems: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఈ 5 విషయాలు ఫాలో అవ్వండి
Fertility Problems: మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం కావచ్చు. వాటిలో PCOD, థైరాయిడ్, ఈస్ట్రోజెన్-ప్రొజెస్టెరోన్ ఇంబాలన్స్ లాంటివి గర్భధారణను ఆటంకపరుస్తుంది.

5 important things that can reduce fertility problems
వివాహానంతరం సంతానం కలగడం అనేది చాలామంది దంపతుల ఒక కల. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడితో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సరైన సమాచారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా సహజగానే గర్భధారణకు అనుకూల వాతావరణం ఏర్పరచుకోవచ్చు. మరి సంతానం కోసం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన 5 ముఖ్య విషయాలు వివరంగా తెలుసుకుందాం.
1.హార్మోన్ల సమతుల్యత/శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి:
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం కావచ్చు. వాటిలో PCOD, థైరాయిడ్, ఈస్ట్రోజెన్-ప్రొజెస్టెరోన్ ఇంబాలన్స్ లాంటివి గర్భధారణను ఆటంకపరుస్తుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ వంటి అంశాలు హార్మోన్లపై ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నెలకు ఒకసారి మానవ హార్మోన్ లెవల్స్ టెస్ట్ చేయించుకోవాలి. PCOD, థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి.
2.పోషకాహారాన్ని తీసుకోవాలి:
ఆరోగ్యకరమైన గర్భధారణకు శరీరానికి ముఖ్యమైన పోషకాలు అవసరం. గర్భధారణకు ముందు, గర్భధారణలో సమయంలో కూడా తప్పనిసరిగా అవసరం. ఐరన్, జింక్, విటమిన్ D, B12, గర్భకోశ ఆరోగ్యానికి ఎగ్, స్పెర్మ్ నాణ్యత పెంచేందుకు అవసరం. ఆంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ డ్యామేజ్ నుంచి రక్షణ ఇస్తాయి. ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు ఎక్కువగా తినాలి. క్యాఫిన్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ తగ్గించాలి.
3.గర్భధారణకు అనుకూలమైన కాలాన్ని తెలుసుకోవడం:
ప్రతి స్త్రీ యొక్క మాసిక ధర్మ చక్రంలో గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉండే ఓవ్యూలేషన్ కాలం ఉంటుంది. తదుపరి పీరియడ్‌కు ముందుగల 12 నుంచి 16 రోజుల మధ్య ప్రయాతం చేయడం ఉత్తమం. ఆ రోజుల్లో ఇంటిమేట్ రిలేషన్‌షిప్ కలిగి ఉండడం ద్వారా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.
4.మానసిక ఒత్తిడిని తగ్గించండి:
అధిక మానసిక ఒత్తిడి, ఆందోళన గర్భధారణకు పెద్ద అడ్డంకి అవుతుంది. ఇది హార్మోన్లను దెబ్బతీసి, ఎగ్, స్పెర్మ్ నాణ్యతను తగ్గించవచ్చు. ఇందుకోసం రోజూ ధ్యానం, ప్రాణాయామం చేయాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. భయాలు, నిరాశను తప్పించుకొని సానుకూల ఆలోచనలు పెంచుకోవాలి.
5.జీవనశైలిని మెరుగుపరచడం:
నిత్యం శారీరక చురుకుదనం, ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవనశైలిని మలచుకోవడం చాలా అవసరం. పురుషులలో పొగతాగే అలవాటు, మద్యం తాగడం వంటివి చేయడం వల్ల స్పెర్మ్ నాణ్యతను తీవ్రంగా తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట ఎక్కువ సమయం గడపడం తప్పించాలి. స్త్రీలలో అధిక బరువు, తక్కువ బరువు కూడా గర్భధారణలో ఆటంకం కలిగించవచ్చు. ఫిట్‌నెస్‌ని మెరుగుపరిచే వ్యాయామాలు చేయాలి.
సంతానం అనేది శారీరకమే కాక మానసికంగా కూడా సిద్ధంగా ఉండే ప్రక్రియ. ఆరోగ్యకరమైన శరీరం, సమతుల్య ఆహారం, నిబద్ధతతో కూడిన జీవనశైలి ద్వారా సహజంగా గర్భధారణకు అవకాశాలు పెరుగుతాయి. అవసరమైతే డాక్టరు సలహా తీసుకోవడం కూడా అవసరం.