కరోనా లక్షణాలను దాచిపెడితే…6నెలలు జైలు శిక్ష

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2020 / 09:44 AM IST
కరోనా లక్షణాలను దాచిపెడితే…6నెలలు జైలు శిక్ష

Updated On : March 16, 2020 / 9:44 AM IST

కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి వాటిని దాటిపెట్టినట్లు దొరికితే వాళ్లకు 6నెలల జైలు శిక్ష పడుతుందని సోమవారం(మార్చి-16,2020)శ్రీలంకకు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు క్వారంటైన్(నిర్భందం)సెంటర్లకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది పెద్ద అపాయం జరిగే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను ఎటువంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తామని సీనియర్ ఇన్స్ పెక్టర్,డీఐజీ అజిత్ రోహణ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక్కో పోలీస్ స్టేషన్ లో 7గురు అధికారులను నియమించామని,వారు క్వారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇస్తారని  ఆయన తెలిపారు. 

అంతేకాకుండా సోషల్ మీడియాలో కరోనాపై తప్పుడు సమాచారం ఇచ్చేవారిపై చట్టం ద్వారా కఠినమైన చర్యలు తీసుకుంటామని శ్రీలంక పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. వైరస్ గురించి సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తున్న 23మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. శ్రీలంకలో ఇప్పటివరకు 18కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు పాజిటివ్ పేషెంట్లు అందరికీ కొలంబో సిటీ శివార్లలోని ఇన్ఫెక్షయస్ డిసీస్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

See Also | శానిటైజర్ అనుకొని ఏమి నొక్కాడో తెలుసా?