Together for Her campaign : మ‌హిళ‌ల క్యాన్స‌ర్ల‌పై అవ‌గాహ‌న కోసం అపోలో “టుగెద‌ర్ ఫ‌ర్ హ‌ర్‌” కాంపెయిన్‌

అన్నిరంగాల్లో రాణిస్తున్న మ‌హిళ‌లు, మాన‌సికంగా బ‌లంగా ఉండే మ‌హిళ‌లు.. త‌మ ఆరోగ్యం ప‌ట్ల కూడా శ్ర‌ద్ధ వ‌హించాల‌ని డాక్ట‌ర్ విజ‌యానంద రెడ్డి సూచించారు.

Together for Her campaign : మ‌హిళ‌ల క్యాన్స‌ర్ల‌పై అవ‌గాహ‌న కోసం అపోలో “టుగెద‌ర్ ఫ‌ర్ హ‌ర్‌” కాంపెయిన్‌

Together for Her campaign

Updated On : March 17, 2024 / 11:35 AM IST

Apollo Cancer Centre : చేయీచేయీ క‌లిపితే సాధించ‌లేనిది లేదంటారు. ఇక యువ‌త అంద‌రూ చేయి క‌లిపితే క్యాన్స‌ర్ లాంటి మ‌హ‌మ్మారి ప‌ని కూడా ప‌ట్ట‌వ‌చ్చు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్‌. హైద‌రాబాద్‌లోని 20కి పైగా కాలేజీల నుంచి విద్యార్థినుల‌ ద్వారా క్యాన్స‌ర్ అవ‌గాహ‌న, నివార‌ణ ప‌ట్ల ప్ర‌జ‌ల్ని ఎడ్యుకేట్ చేయ‌డానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ సంద‌ర్భంగా హోట‌ల్ తాజ్ డెక్క‌న్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో మ‌హిళ‌ల్లో క్యాన్స‌ర్ల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే విష‌యంపై ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

Also Read : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!

మ‌హిళ‌ల క్యాన్స‌ర్ల‌పై అవ‌గాహ‌న పెంపొందించ‌డానికి “టుగెద‌ర్ ఫ‌ర్ హ‌ర్” పేరుతో కాంపెయిన్‌ను అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్‌ ప్రారంభించింది. అంతేగాక‌, ప‌లు రంగాల మ‌హిళ‌ల‌ను, వారి కుటుంబ స‌భ్యుల‌ను క్యాన్స‌ర్ స్క్రీనింగ్‌, ఇత‌ర అంశాల‌పై ఎడ్యుకేట్ చేయ‌డంకోసం ఒక ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. భారత దేశంలోనే తొలిసారిగా “పర్పుల్ క్లిప్ ఛాంపియన్స్ బ్రిగేడ్” పేరుతో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ బ్రిగేడ్ లో హైద‌రాబాద్‌లోని వివిధ క‌ళాశాల‌లకు చెందిన స్టూడెంట్స్ ఇందులో భాగ‌స్వాముల‌య్యారు. ఎంపిక చేసిన కాలేజీల నుంచి విద్యార్థులు, న్యాయ‌వాదులు, ఉపాధ్యాయులు, ఇత‌ర రంగాల వారంద‌రూ ఈ బ్రిగేడ్ ద్వారా అవగాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. వీరికి అపోలో సీనియ‌ర్ ఆంకాల‌జిస్టులు మ‌హిళ‌ల క్యాన్స‌ర్ నివార‌ణ ప‌ట్ల ప్ర‌త్యేక శిక్ష‌ణ‌నందించారు. వీరు త‌మ త‌మ క‌మ్యూనిటీల‌లో క్యాన్స‌ర్ నివార‌ణ‌, మేనేజ్‌మెంట్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగిస్తూ మ‌హిళ‌ల్లో మ‌నోధైర్యాన్ని నింప‌డం ద్వారా క్యాన్స‌ర్ ను త‌రిమేసే ప్ర‌య‌త్నం చేస్తారు.

Apollo Cancer Centre

అన్నిరంగాల్లో రాణిస్తున్న మ‌హిళ‌లు, మాన‌సికంగా బ‌లంగా ఉండే మ‌హిళ‌లు.. త‌మ ఆరోగ్యం ప‌ట్ల కూడా శ్ర‌ద్ధ వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌, సీనియ‌ర్ రేడియేష‌న్ ఆంకాల‌జిస్ట్ డాక్ట‌ర్ విజ‌యానంద రెడ్డి సూచించారు. వైద్య ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ప్రభుత్వ కార్యదర్శి ఐఏఎస్ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రిత‌మే ఆరోగ్య మ‌హిళ పేరుతో మ‌హిళ‌లకోసం అన్ని ర‌కాల స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు, ఒబెసిటీ లాంటి ఇత‌ర‌త్రా వ్యాధుల ప‌ట్ల అవ‌గాహ‌న కోసం కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టామ‌ని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా పీహెచ్‌సీ సెంట‌ర్ల‌లో ఈ ప‌రీక్ష‌లు అందుబాటులో తెలిపారు. మ‌హిళ‌లు అశ్ర‌ద్ధ చేయ‌కుండా స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆమె సూచించారు.

Also Read : Health insurance: హెల్త్ ఇన్సురెన్స్ ఉందా? ఇకపై అన్ని ఆస్పత్రుల్లో పూర్తిగా ‘క్యాష్‌లెస్’ చికిత్స

ఏడీజీ (ఆప‌రేష‌న్స్‌) గ్రేహౌండ్స్‌, ఆక్టోప‌స్‌, తెలంగాణ పోలీస్ డాక్ట‌ర్ విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. మ‌హిళ‌ల ఆరోగ్యం వారి మాన‌సిక బ‌లం పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. మ‌న‌సు ప్ర‌శాంతంగా, కామ్ గా ఉండాలి. శ‌రీరం ప‌నిచేయాలి. ఇప్పుడంతా అపోజిట్ అయిపోయింది. అందుకే మాన‌సిక ఒత్తిడి పెరిగి, శారీర‌క శ్ర‌మ త‌గ్గింది. క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ జీవ‌న‌శైలి మార్చుకోవాల‌ని సూచించారు డాక్ట‌ర్ విజ‌య్ కుమార్‌ సూచించారు. చ‌బ్ సంస్థ హెచ్ఆర్ హెడ్ గా స్వ‌ప్న స‌రిప‌ల్లి “ఆరోగ్య‌వంత‌మైన మ‌హిళ‌లే బ‌ల‌మైన స‌మాజం ఏర్ప‌డ‌టానికి దోహ‌ద‌ప‌డుతార‌ని, అందుకే కుటుంబ‌మే కాదు.. స‌మాజం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే మ‌హిళ‌లు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ పెట్ట‌డం అవ‌స‌ర‌మ‌న్నారు. ఉద్యోగినుల‌కు త‌మ సంస్థ‌ల నుంచి స‌పోర్టు త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌త్యేకంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్యులు సర్జికల్ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి ల‌క్ష్మి డయానా, సర్జికల్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ కనుమూరి కూడా పాల్గొన్నారు.