French Pies : రోజు ఫ్రెంచ్ పైస్ తినే అలవాటుందా? అయితే మరణం అంచులకే?

ఫ్రైలను హైడ్రోజనేటెడ్ నూనెలలో వేయించినందున, వాటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

French Pies : రోజు ఫ్రెంచ్ పైస్ తినే అలవాటుందా? అయితే మరణం అంచులకే?

French fries

Updated On : August 29, 2022 / 6:48 AM IST

French Pies : ఫ్రెంచ్ ఫ్రైస్ ఖచ్చితంగా రుచికరమైన, అత్యంత సౌకర్యవంతమైన ఆహారాలలో ఒకటి. అంతే కాదు బంగాళాదుంప వేపుళ్ల రుచికి ఒక్కసారి అలవాటైతే ఇక వాటిని తినకుండా మానుకులేరు. ప్రెంచ్ పైస్ దీర్ఘకాలంలో మీ ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముందస్తు మరణం ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.

ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన 4,500 మంది వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఫ్రెంచ్ ఫ్రైస్‌ను వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు తినడం వల్ల ముందస్తు మరణం యొక్క ప్రమాదాన్ని రెట్టింపు అవుతుందని తేలింది. ఫ్రెంచ్ పైస్ లను వేయించేందుకు ఉపయోగించే నూనెలు ఆరోగ్య ప్రమాదానికి ముఖ్యకారణమని పరిశోధకులు తేల్చారు.

ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ;

కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో పోలిస్తే కొవ్వులు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఫ్రైస్ కడుపులో ఆరోగ్యకరమైన ఆహారం కంటే ఎక్కువ సమయం పాటు జీర్ణమయ్యేందుకు సమయం తీసుకుంటాయి. జర్నల్ అల్ట్రాసౌండ్ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వేయించిన ఆహారాన్ని తీసుకుంటే కడుపు నొప్పులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫ్రైలను హైడ్రోజనేటెడ్ నూనెలలో వేయించినందున, వాటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మరొక అధ్యయనం ప్రకారం రక్తంలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం వచ్చే అవకాశం 75 శాతం ఎక్కువని తేలింది.

కరెంట్ ఒపీనియన్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిక్ కేర్ అనే జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అధిక కొవ్వు జిడ్డైన ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడం ద్వారా మైక్రోబయోమ్‌ను దెబ్బతీస్తుంది. తద్వారా మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.

వారానికి మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వేయించిన ఆహారాన్ని తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు 7 శాతం పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ వేయించిన ఆహారాన్ని తీసుకుంటే, ప్రమాదం 15 శాతం రెట్టింపు అవుతుంది.

ఆహారాన్ని నూనెల్లో వేయించినప్పుడు, అవి క్యాలరీల బాంబులుగా మారుతాయి, అలాంటివి తీసుకుంటే అమాంతం బరువు పెరిగేందుకు దారితీస్తుంది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, వేయించిన ఆహారాన్ని తినడం స్థూలకాయంతో నేరుగా ముడిపడి ఉందని తేలింది.