అద్భ‌తం చేసిన డాక్ట‌ర్…

వైద్యుల‌ని మ‌నం దేవుళ్లుగా చూస్తాం. క‌న‌ప‌డ‌ని ఆ దేవుళ్ల‌ని ఎలా పూజిస్తామో, గౌర‌విస్తామో...వీళ్ల‌ని అలానే గౌర‌విస్తాం. ఇప్పుడు ఆగౌర‌వాన్ని మ‌రింత రెట్టింపు చేసారు నిలోఫ‌ర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సి.కె.రెడ్డి . త‌న వైద్యంతో ఓ అద్భ‌తం చేశారు . రెండు నిండు ప్రాణాల్ని కాపాడి ఆ కుటుంబానికి దేవుడ‌య్యారు నిలోఫ‌ర్.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 03:48 AM IST
అద్భ‌తం చేసిన  డాక్ట‌ర్…

వైద్యుల‌ని మ‌నం దేవుళ్లుగా చూస్తాం. క‌న‌ప‌డ‌ని ఆ దేవుళ్ల‌ని ఎలా పూజిస్తామో, గౌర‌విస్తామో…వీళ్ల‌ని అలానే గౌర‌విస్తాం. ఇప్పుడు ఆగౌర‌వాన్ని మ‌రింత రెట్టింపు చేసారు నిలోఫ‌ర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సి.కె.రెడ్డి . త‌న వైద్యంతో ఓ అద్భ‌తం చేశారు . రెండు నిండు ప్రాణాల్ని కాపాడి ఆ కుటుంబానికి దేవుడ‌య్యారు నిలోఫ‌ర్.

వైద్యుల‌ని మ‌నం దేవుళ్లుగా చూస్తాం. క‌న‌ప‌డ‌ని ఆ దేవుళ్ల‌ని ఎలా పూజిస్తామో, గౌర‌విస్తామో…వీళ్ల‌ని అలానే గౌర‌విస్తాం. ఇప్పుడు ఆగౌర‌వాన్ని మ‌రింత రెట్టింపు చేసారు నిలోఫ‌ర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సి.కె.రెడ్డి . త‌న వైద్యంతో ఓ అద్భ‌తం చేశారు . రెండు నిండు ప్రాణాల్ని కాపాడి ఆ కుటుంబానికి దేవుడ‌య్యారు నిలోఫ‌ర్. 

 శిశువు కడుపులో మరో శిశువు పెరుగుతున్న అత్యంత అరుదైన ఘటన. పుట్టుకతోనే కడుపులో పిండంతో జన్మించిన‌ ఓ పసికందుకు క్లిష్టమైన శస్త్రచికిత్సను అందించి ప్రాణాలను నిలబెట్టింది నిలోఫర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలోని వైద్య బృందం. తల్లి గర్భంలో ఉండగానే శిశువు పొట్టలోకి చేరిన పిండం, తల్లి ప్రసవించిన తర్వాత శిశువు పొట్టలో క్రమంగా పెరగసాగింది. పొట్టలోని కాలేయం, కిడ్నీ, రక్తనాళాలకు ఆనుకొని ఉన్న ఈ పిండాన్ని  జాగ్రత్తగా బయటకు తీశారు వైద్యులు. ఐదు లక్షల మంది శిశువుల్లో ఒకరికి మాత్ర‌మే ఇలా జరిగే అవకాశం ఉందని, ప్రపంచ వైద్య చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి కేసులు 200 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. మనదేశంలో తొలిసారిగా 1999లో నాగపూర్‌కు చెందిన సంజు భగత్‌(36) కడుపులో ఇదే విధంగా పిండం తయారయ్యిందని వైద్యులు చెప్పారు. హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతానికి చెందిన దంపతులకు నెల కిందట ఓ ఆడశిశువు జన్మించింది. తల్లి 9 నెలల గర్భంతో ఉన్నప్పుడే శిశువు కడుపులో గడ్డ ఏర్పడినట్లు స్కానింగ్‌తో వైద్యులు గుర్తించారు.

జన్మించిన తర్వాత శిశువు పొట్టలో గుర్తించిన గడ్డ క్రమంగా పెరగసాగింది. దీంతో డిసెంబ‌ర్ 30న మాదాపూర్‌ కావూరిహిల్స్‌లోని ఆసుపత్రికి వచ్చి డా.ఎన్‌.సి.కె.రెడ్డిని కలిశారు. గర్భంలో కవల పిల్లలకు అవకాశం ఉండి ఒక పిండం మరో పిండం పొట్టలోకి వెళ్లి ఉండవచ్చని భావించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. తన వైద్య బృందంతో ఈనెల 3న శిశువుకు శస్త్రచికిత్సను అందించి శిశువు పొట్టలోని ఇతర భాగాలకు హానీ కలగకుండా పిండాన్ని తీశారు. ప్రసుత్తం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 5రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు.
పిండం బరువు 500గ్రాములు ఉందని డాక్టర్ తెలిపారు. తాను నిలోఫర్‌లో పనిచేస్తున్న సమయంలో 1989లో మొదటిసారి ఇలాంటి శస్త్రచికిత్స చేశానన్నారు. తన 45ఏళ్ల వైద్య జీవితంలో ఇలాంటి కేసులు 6 మాత్రమే చూశానని ఆయన తెలిపారు.