బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో టెన్షన్.. టెన్షన్
Brain eating amoeba: ఈ వ్యాధి ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్.

Brain eating amoeba
అంతుచిక్కని వింత వ్యాధి కేరళను వణికిస్తోంది. నెల రోజులుగా కేరళ జనాల్లో టెన్షన్ పెడుతోన్న ఈ వ్యాధి బారిన పడిన రోగుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే ముగ్గురు చిన్నారులు చనిపోగా.. ఇప్పుడు నాలుగో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధి ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్.
బ్రెయిన్ ఈటింగ్ అమీబా వెచ్చని నీటిలో నివసిస్తుంది. ఈ అమీబా శరీరంలోకి వెళ్లాక కేంద్ర నాడీ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతోంది.. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటేనే మెదడును తింటుందని అర్థం. దాంతో మెదడు పనిచేయడం నెమ్మదించి.. ట్రీట్‌మెంట్ ఇచ్చినా బాడీ రెస్పాండ్ కాదు. తర్వాత మనిషి ప్రాణాలు పోయే స్థితికి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.
స్విమ్మింగ్ పూల్స్‌లో
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. కొన్నిసార్లు అమీబా మురికినీళ్లు, చాలా రోజులు నీళ్లు స్టోర్ చేసిన స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన రెండు వారాల నుంచి 15 రోజుల తర్వాత దాని లక్షణాలు కనిపించి.. ఆ తర్వాత వెంటనే బాడీ మొత్తం స్ప్రెడ్ అవడం.. ప్రాణాల మీదకు రావడం వేగంగా జరిగిపోతూ ఉంటుంది.
శరీరంలో అమీబా వ్యాప్తి మొదలైన తర్వాత మెడ బిగుసుకుపోవడం, మెడ చుట్టూ స్పర్శ కోల్పోవడం, మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోవడం వంటివి బయటికి కనిపిస్తాయని అంటున్నారు డాక్టర్లు. వ్యాధి లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుంచి 18 రోజుల్లోపు బాధితులు చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ మెదడును తినే అరుదైన అమీబా వ్యాధి కేరళ ప్రజలను టెన్షన్ పెడుతోంది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలోని పయోలి ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకడంతో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. విదేశాల నుంచి మందులు తెప్పించి చికిత్స చేస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నతస్థాయి వైద్యాధికారులతో చర్చించి అలర్ట్ ప్రకటించారు. అపరిశుభ్రమైన నీటిలో స్నానాలు చేయొద్దని, పిల్లలు ఈత కొట్టకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పిల్లల్లో అధికంగా ఇన్ఫెక్షన్
స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ చేస్తున్నారు అధికారులు. పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకే అవకాశం ఉండటంతో చెరువులు, నదుల దగ్గరకు వెళ్లినప్పుడు స్విమ్మింగ్ నోస్ క్లిప్‌లు వాడాలని సూచించారు. ఈ ఏడాది మేలో మలప్పురంలో ఓ ఐదేళ్ల బాలిక, జూన్‌లో కన్నూర్‌లో 13 ఏళ్ల మరో బాలిక ఇదే వ్యాధితో చనిపోయారు. 2017, 2023ల్లో అలప్పుజ జిల్లాలో అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్ కేసులు నమోదయ్యాయి.
ఈతకొట్టడం, డైవింగ్ చేయడం, శ్వాస సరిగ్గా ఆడటానికి నాసల్ స్ప్రేను వాడితే కలుషిత జలాలు ముక్కు నుంచి శరీరంలోకి వెళ్తాయి. ఇలా లోపలికి వెళ్లిన అమీబా మెదడులోకి వెళ్లి అక్కడ అది ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. బ్రెయిన్ సెల్స్‌ను దెబ్బతీసి డేంజర్‌గా మారుతుంది.
బ్యాక్టీరియల్, వైరల్ మెనింజైటిస్‌తో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు లాంటివే బ్రెయిన్ ఈటింగ్ అమీబాలోనూ కనిపిస్తాయి. ఐదు నుంచి ఏడు రోజులలోపు రోగి మెదడులో మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. కపాలం లోపల ఒత్తిడి, ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అమీబా సోకితే కొన్నిసార్లయితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. యాంటీ మైక్రోబియల్ చికిత్స చేసినప్పటికీ మరణాల రేటు ఎక్కువగానే ఉంటుందని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.
వరల్డ్ వైడ్‌గా హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలు.. సెలబ్రిటీలకు నచ్చే టాప్ డిష్‌లలో మన వంటకం