Hair Health Tips: గంజి తాగితే కాదు, తలకూ మంచిదే.. జుట్టు ఆరోగ్యానికి గంజి ప్రయోజనాలు.. పాత పద్ధతిలో కొత్త అందం

Hair Health Tips: గంజిలో ఉండే ఇనాసిటోల్ (Inositol) అనే పదార్థం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇది స్కాల్ప్ లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Hair Health Tips: గంజి తాగితే కాదు, తలకూ మంచిదే.. జుట్టు ఆరోగ్యానికి గంజి ప్రయోజనాలు.. పాత పద్ధతిలో కొత్త అందం

Benefits of using porridge for hair health

Updated On : July 9, 2025 / 8:47 AM IST

అందం అంటే కేవలం ముఖమే కాదు ఆరోగ్యవంతమైన జుట్టూ కూడా. ఆడవాళ్ళకి కురుల సౌందర్యం ఎంత ముఖ్యమొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. షాంపూలు, ఖరీదైన ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ, ప్రెజెంట్ జనరేషన్లో జుట్టు సమస్యలు ఎక్కువవుతున్నాయి. పొగ, దుమ్ము, ధూళి కారణంగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జుట్టు పతనం, పొడిబారిన జుట్టు, స్కాల్ప్ సమస్యలు ఇవన్నీ రోజూ చాలామందిని వేధిస్తున్న సమస్యలుగా మారాయి. మరి జుట్టు ఆరోగ్యం కోసం ఒక పాత పద్దతి అనువైనదని నిపుణులు చెప్తున్నారు. అదే గంజి. గంజి వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతనదట. మరి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు గంజి అంటే ఏమిటి?

గంజి అనేది అన్నాన్ని మరిగించిన తర్వాత మిగిలే నీరు. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, ఖనిజాలు ముఖ్యంగా ఇనాసిటోల్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

జుట్టు ఆరోగ్యానికి గంజి వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు:

1.జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది:
గంజిలో ఉండే ఇనాసిటోల్ (Inositol) అనే పదార్థం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇది స్కాల్ప్ లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

2.జుట్టు తేలికగా, మెత్తగా మారుతుంది:
గంజిని జుట్టుకు పూయడం వల్ల జుట్టు నిగారుగా, సున్నితంగా మారుతుంది. ఇది సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది. కానీ, హెయిర్ కండీషనర్ లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి జుట్టును డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి గంజి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

3.జుట్టు రాలడాన్ని తగ్గుతుంది:
గంజి స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు రూట్లకి బలాన్ని అందిస్తుంది. కాబట్టి జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

4.డాండ్రఫ్ తగ్గిస్తుంది:
గంజిలో ఉండే శీతలత లక్షణాలు స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతూ, పొడిబారిన చర్మాన్ని తేమగా మారుస్తాయి. దీనివల్ల పొడిబారిన స్కిన్ తేమగా మారి డాండ్రఫ్‌ తగ్గుతుంది. దానివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

5.జుట్టుకు ప్రకాశాన్ని ఇస్తుంది:
గంజిని తరచూ వాడడం వల్ల జుట్టు సహజంగా మెరిసిపోతుంది. ఇది జుట్టులో పొడిగా కనిపించే రూపాన్ని తగ్గిస్తుంది.

6. కెమికల్ ఫ్రీ, సహజమైన హెయిర్ ట్రీట్‌మెంట్:
మార్కెట్ లో లభ్యమయ్యే హెయిర్ కండీషనర్లు అధికంగా కెమికల్స్‌తో నిండి ఉంటాయి. కానీ, గంజి మాత్రం పూర్తిగా సహజమైనది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

గంజిని జుట్టుకు ఎలా వాడుకోవాలి?

1.హెయిర్ రిన్‌గా (Hair Rinse) వాడటం:

  • అన్నం మరిగించిన తర్వాత మిగిలిన గంజిని గట్టిగా వడకట్టాలి
  • దాన్ని చల్లార్చి, తల స్నానం చేసిన తర్వాత గంజితో తలను కడగాలి
  • అలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలి
  • తరువాత సాధారణ నీటితో కడగాలి.

2.స్కాల్ప్ మసాజ్ కోసం:

  • గంజిని తీసుకుని జుట్టు మొదట్లో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
  • ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.
  • జుట్టు రాలడం తగ్గుతుంది
  • ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది

మరికొన్ని చిట్కాలు మీకోసం:

  • పాత బియ్యం వాడటం వల్ల గంజిలో పోషకాలు అధికంగా ఉంటాయి.
  • గంజిని వడకట్టి 2 నుంచి 3 రోజులకు ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
  • గంజిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గంజి అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు కోసం కూడా ఒక ఔషధం లాంటిదే. ఇది తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా సహజంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ జుట్టు సమస్యలకు సహజ పరిష్కారం కావాలంటే – గంజిని మీ హెయిర్‌కేర్ రొటీన్‌లో ఒక భాగంగా చేసుకోండి. సహజం – సురక్షితం – శక్తివంతం!