Diabetic: శెనగ పప్పు షుగర్ ను కంట్రోల్ చేస్తుందా?.. చాలా మంది చేస్తున్న తప్పు ఇదే

Diabetic: శెనగపప్పు పీచు పదార్థం, ప్రోటీన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌ ఒక్కసారిగా పెరగడానికి అవకాశం ఉండదు.

Diabetic: శెనగ పప్పు షుగర్ ను కంట్రోల్ చేస్తుందా?.. చాలా మంది చేస్తున్న తప్పు ఇదే

Can diabetic patients control their sugar levels by eating lentils?

Updated On : August 6, 2025 / 3:55 PM IST

శెనగపప్పు మానవ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇది మన రోజువారీ ఆహరంలో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది.అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే. మధుమేహం ఉన్నవారు శెనగపప్పు తినవచ్చా. తింటే ఏమవుతుంది అని. నిజానికి మధుమేహం ఉన్నవారు శెనిగపప్పు తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. కానీ, చాలామంది దీన్ని తిన్నపుడు చేస్తున్న ఒక సాధారణ తప్పు వారి షుగర్ స్థాయిని మెరుగుపరచకుండా నిలిపివేస్తుంది. ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.

శెనగపప్పు షుగర్‌ను కంట్రోల్ చేస్తుందా?
శెనగపప్పు పీచు పదార్థం, ప్రోటీన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌ ఒక్కసారిగా పెరగడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మధుమేహం ఉన్నవారికి ఇది సరైన ఆహారంగా పరిగణించబడుతుంది.

శెనగపప్పులోని పోషక విలువలు(100 గ్రామ్స్):

  • కేలరీలు: 330 kcal
  • ప్రోటీన్: 20 గ్రాములు
  • ఫైబర్: 10 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు: 55 గ్రాములు (Low GI)
  • ఫ్యాట్: తక్కువ
  • విటమిన్ B, ఐరన్, మాగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

శెనగపప్పు డయాబెటిక్‌కి ఎలా మేలు చేస్తుంది?
1. లౌ గ్లైసిమిక్ ఇండెక్స్:
శెనగపప్పులో లౌ గ్లైసిమిక్ ఇండెక్స్ 28 మాత్రమే ఉంటుంది. GI తక్కువగా ఉండే ఆహారం రక్తంలో గ్లూకోజ్‌ను మెల్లగా విడుదల చేస్తుంది. కాబట్టి, షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది.

2.పీచు (Fiber) అధికంగా ఉండటం:
శెనగ పిండిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

3.ప్రోటీన్ సపోర్ట్:
ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కానీ, చాలా మంది చేసే పొరపాటు ఇదే:

  • శెనగపప్పు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దీనిని ఎలా వండుతామో, ఏ పదార్థాలతో కలిపి తింటామో అనేదే చాలా కీలకం.
  • శెనగపప్పులో ఎక్కువగా నూనె, గోరువెచ్చటి నెయ్యి లేదా వేడి తాలింపు వేసి వండటం వల్ల ఫ్యాట్ కంటెంట్‌ను పెంచి గ్లూకోజ్ స్పైక్‌కు కారణమవుతుంది.
  • బెళ్ళం లేదా చక్కెరతో కలిపి శెనగపప్పు తినటం వల్ల నేరుగా షుగర్ పెరగడానికి కారణం అవుతుంది
  • అల్రెడీ కార్బొహైడ్రేట్ ఉన్న ఆహారాలతో పాటు శెనగపప్పు తినటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
  • ఏ ఆహారం అయినా ఎక్కువ మోతాదులో తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.
  • నిజానికి శెనగపప్పు డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది. కానీ, దానిని వాడే విధానం సరియైనదిగా ఉండాలి.