కరోనా కోరలు పీకేస్తాం : ఇటలీకి చైనా వైద్యనిపుణుల బృందం 

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 01:58 AM IST
కరోనా కోరలు పీకేస్తాం : ఇటలీకి చైనా వైద్యనిపుణుల బృందం 

Updated On : March 12, 2020 / 1:58 AM IST

ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనా నుంచి ఇటలీకి వైద్య నిపుణుల బృందం వెళ్తోంది. యూరపియన్ దేశంలో కరోనా కోరలు సాచింది. వందలాది మందిని మింగేస్తోంది. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో ప్రాణాలు తీసేసింది. కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. రోజురోజుకీ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనా బారి నుంచి ఇటలీకి సాయం చేసేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది. కరోనా కోరలు పీకేందుకు వైద్యనిపుణుల బృందాన్ని ఇటలీకి పంపుతోంది చైనా. ఇప్పటికే ఇరాన్, ఇరాక్ దేశాలకు అవసరమైన సాయాన్ని బీజింగ్ అందిస్తోంది.

సెంట్రల్ చైనాలో ఇప్పటివరకూ కరోనా సోకి 4,200 మందికి పైగా మృతిచెందగా, 117,000 మందికి వైరస్ సోకింది. కరోనా బాధితుల్లో ఎక్కువ మంది చైనా దేశీయులే ఉన్నారు. చైనా తర్వాత అత్యధిస్థాయిలో కరోనా వ్యాప్తిని ఇటలీ ఎదుర్కొంటోంది. యూరోపియన్ దేశంలో మంగళవారం ఒక్క రోజే Covid-19 వైరస్ సోకి 168మంది మృత్యువాడపడ్డారు. కరోనా ప్రభావంతో ఇటలీలో లాక్ డౌన్ అయింది. కరోనా వ్యాధితో మృతిచెందిన వారి సంఖ్య 631 మందికి చేరింది. 10వేల మందికి పైగా కరోనా బాధితులు ఉన్నారు.

60 మిలియన్ల మంది నివాసముండే రోమ్ నగరం మొత్తాన్ని నిర్భందంలో ఉంచారు. పక్క దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ చైనా ఆధ్వర్యంలో వైద్యనిపుణుల బృందాన్ని ఇటలీకి పంపుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వైద్య పరికరాలతో పాటు అక్కడ అవసరమైన వస్తువులను కూడా సరఫరా చేస్తోంది చైనా. అక్కడి దేశంలో వైద్య పరికరాల కొరత ఉండటంతో చైనా సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని ఇటలీ ఫారెన్ మినిస్టర్ లుయిగి డి మైయో తెలిపారు. 

See More :

•  జర్మనీలో 70శాతం మందికి కరోనా ప్రమాదం రావొచ్చు: ప్రధాని

•​​​​​​​ ఖతర్‌లో ఒక్కరోజే 238 కరోనా కేసులు

•​​​​​​​ కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO